BCCI : టీమ్ఇండియా హెడ్‌కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమిత్ షా, స‌చిన్ టెండూల్క‌ర్‌..?

హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు గ‌డువు సోమ‌వారంతో ముగిసింది.

BCCI Receive More Than 3000 Applications For Indias Head coach role

Board of Control for Cricket in India : టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వి కాలం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో హెడ్ కోచ్ ప‌ద‌వికి భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. ద్ర‌విడ్ త‌రువాత అత‌డి స్థానంలో కొత్త కోచ్‌గా ఎవ‌రు వ‌స్తారు అన్న ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు గ‌డువు సోమ‌వారంతో ముగిసింది. మొత్తం మూడు వేల‌కు పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లుగా ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ త‌న క‌థ‌నంలో తెలిపింది.

ఇందులో చాలా వ‌ర‌కు ఫేక్ అప్లికేష‌న్లు ఉన్నాయి. ప్ర‌ధాని మంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి ప్ర‌ముఖుల పేర్ల‌తో ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లుగా పేర్కొంది. అయితే.. అర్హులైన వారు ఎవ‌రెవ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు అన్న సంగ‌తి ఇంకా తెలియ‌రాలేదు. అర్హ‌త ఉన్న ద‌ర‌ఖాస్తుదారుల‌ను క‌న్ఫార్మ్ చేసుకోవ‌డం కోసం బీసీసీఐ ప‌ర్స‌న‌ల్‌గా మెయిల్స్ పంపుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

Russell – Ananya Pandey : నైట్‌పార్టీలో కేకేఆర్ ఆల్‌రౌండ‌ర్‌తో ఓరేంజ్‌లో రెచ్చిపోయిన బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే..

ఫేక్ అప్లికేష‌న‌క్లు కార‌ణం ఇదేనా..?

హెడ్ కోచ్ ప‌ద‌వి కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తూ అందుకు గ‌ల అర్హ‌త‌లను తెలియ‌జేస్తూ బీసీసీఐ ఇటీవ‌ల ఓ ప్ర‌క‌ట‌న‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది. దీంతో పాటు దర‌ఖాస్తు చేసుకోవడానికి గ‌ల లింక్‌ను సైతం అక్క‌డే పొందుప‌రిచింది. అంద‌రికి లింక్ అందుబాటులో ఉండ‌డంతో ఎలాంటి అర్హ‌త‌లు లేక‌పోయినా కొంత మంది త‌మ పేర్ల‌తో ఇంకొంద‌రు వేరే వారి పేర్ల‌తో అప్లికేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు.

కాగా.. సెల‌బ్రిటీల పేర్ల‌తో ఫేక్ అప్లికేష‌న్లు రావ‌డం ఇదే తొలిసారి కాదు. 2022లో బీసీసీఐ ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించిన‌ప్పుడు కూడా ఇలాగే జ‌రిగింది. అప్పుడు 5వేల‌కు పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

Riyan Parag : నీకు ఇదేం పాడు బుద్ధి నాయ‌నా..! హీరోయిన్ల అందాల కోసం తెగ వెతికిన పరాగ్‌ ?

ఇదిలా ఉంటే.. కొత్త కోచ్ రేసులో అంద‌రి కంటే ముందు టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంటార్ గౌత‌మ్ గంభీర్ ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసిన త‌రువాత గంభీర్‌తో జైషా సుదీర్ఘంగా చ‌ర్చించ‌డం ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.

కొత్త‌గా టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి చేప‌ట్టే వ్య‌క్తి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 ముగిసే వ‌ర‌కు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నాడు. అత‌డి అనుభ‌వాన్ని బ‌ట్టి పారితోషికం ఉండ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు