Russell – Ananya Pandey : నైట్‌పార్టీలో కేకేఆర్ ఆల్‌రౌండ‌ర్‌తో ఓరేంజ్‌లో రెచ్చిపోయిన బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే..

బాలీవుడ్ న‌టి అనన్య పాండేతో క‌లిసి ర‌స్సెల్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డుంకీ చిత్రంలోని 'లుట్ పుట్ గయా కి సెప్టులేశాడు.

Russell – Ananya Pandey : నైట్‌పార్టీలో కేకేఆర్ ఆల్‌రౌండ‌ర్‌తో ఓరేంజ్‌లో రెచ్చిపోయిన బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే..

Andre Russell dance with Ananya Panday Lutt Putt Gaya song At KKR Victory Party

Updated On : May 28, 2024 / 9:58 AM IST

Russell – Ananya Pandey : రెండు నెల‌ల పాటు అల‌రించిన ఐపీఎల్ 17వ సీజ‌న్ ముగిసింది. ఫైన‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను ఓడించి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ విజేత‌గా నిలిచింది. మూడోసారి క‌ప్పును ముద్దాడంతో కేకేఆర్ జ‌ట్టు సోమ‌వారం తెల్ల‌వారుజాము వ‌ర‌కు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంది. కేకేఆర్ ఫైన‌ల్ మ్యాచ్ గెల‌వ‌డంతో ఆల్‌రౌండ‌ర్ ఆండ్రీ ర‌స్సెల్ సైతం త‌న‌వంతు పాత్ర పోషించాడు. 2.3 ఓవ‌ర్లు వేసిన ర‌స్సెల్ 19 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన మూడు వికెట్లు తీశాడు.

ఇక క‌ప్పు గెల‌వ‌డంతో కేకేఆర్ బృందం మొత్తం పార్టీలో మునిగిపోయింది. తిన‌డం, తాగ‌డం, నృత్యం చేయ‌డం వంటివి చేశారు. బాలీవుడ్ న‌టి అనన్య పాండేతో క‌లిసి ర‌స్సెల్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డుంకీ చిత్రంలోని ‘లుట్ పుట్ గయా’ కి సెప్టులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Riyan Parag : నీకు ఇదేం పాడు బుద్ధి నాయ‌నా..! హీరోయిన్ల అందాల కోసం తెగ వెతికిన పరాగ్‌ ?

ఈ వీడియోలో ర‌స్సెల్‌కు అన‌న్య సెప్ట్ మూమెంట్ నేర్పిస్తూ క‌నిపించింది. కేకేఆర్ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్, ఆటగాడు రమణదీప్ సింగ్ కూడా ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తూ ఆనందంగా ఉండ‌డాన్ని చూడొచ్చు.

షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌, బాలీవుడ్ న‌టి అనన్య పాండే చిన్న‌నాటి నుంచి మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కేకేఆర్ ఆడే మ్యాచ్‌ల‌కు అన‌న్య హాజ‌ర‌వుతూ ఆట‌గాళ్ల‌ను ఎంక‌రేజ్ చేస్తూ వ‌స్తోంది. ఇక చెపాక్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌కు సుహానా ఖాన్, షానాయ కపూర్‌లతో క‌లిసి హాజ‌రైంది. మ్యాచ్ గెలిచిన త‌రువాతి పార్టీలోనూ సంద‌డి చేసింది.

Kavya Maran : కావ్యాపాప క‌న్నీళ్లు.. ఓదార్చిన అమితాబ్ బ‌చ్చ‌న్‌.. ‘ఇది ముగింపు కాదు..’