ICC World Cup 2023: అలా సాధ్యంకాదు .. హెచ్‌సీఏ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ .. పోలీసులకు తప్పని తిప్పలు

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో దేశంలోని పది మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

Rajiv Gandhi International Cricket Stadium Hyderabad (File Photo)

ICC World Cup 2023 Hyderabad Schedule : భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో దేశంలోని పది మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే ఐసీసీ మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో టీమిండియా ఆడే మ్యాచ్ లు ఏమీ లేకపోయినా పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్ లు ఉన్నాయి. అక్టోబర్ 6న పాకిస్థాన్ -నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 9న న్యూజిలాండ్ – నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. మరుసటిరోజు అక్టోబర్ 10న పాకిస్థాన్ – శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో భద్రత అంశాల పరంగా సమస్యలు తెలెత్తుతాయని హైదరాబాద్ పోలీస్ విభాగం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దృష్టికి తీసుకెళ్లింది. గ్యాప్ లేకుండా వరుసగా రెండు రోజులు మ్యాచ్ ల వల్ల భద్రత కల్పించడం కష్టతరంగా మారుతుందని సూచింది.

Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. తిలక్ వర్మకు అవకాశం.. ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ

హైదరాబాద్ నగర పోలీసు విభాగం విజ్ఞప్తిని హెచ్‌సీఏ బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లింది. 9, 10 తేదీల్లో వరుసగా మ్యాచ్‌లు ఉండటం వల్ల భద్రత విషయంలో పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, మ్యాచ్‌ల మధ్య ఒకటి రెండు రోజులు గ్యాప్ ఉండేలా తేదీలను మార్చాలని కోరింది. కానీ, హెచ్‌సీఏ విజ్ఞప్తిని బీసీసీఐ తిరస్కరించింది. ప్రపంచకప్ షెడ్యూల్ లో మార్పులు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఒక‌దఫా షెడ్యూల్‌లో మార్పులు చేయడం జరిగిందని, మరోసారి మ్యాచ్‌ల నిర్వహణ తేదీలు మార్చడం సాధ్యం కాదని హెచ్‌సీఏకు స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్టేడియం వేధికగా యథాతధంగా మ్యాచ్‍‌లు జరగనున్నాయి.

Asia Cup 2023 Match Timings : ఆసియాక‌ప్‌లో మ్యాచులు ఎన్ని గంట‌ల‌కు మొద‌లవుతాయంటే..? పూర్తి షెడ్యూల్ ఇదే..

షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో 9, 10 తేదీల్లో జరిగే మ్యాచ్ ల నిర్వహణకు ఎలాంటి భద్రత ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకొనేందుకు నగర పోలీస్ శాఖ దృష్టిసారించింది. ఈ విషయంపై హెచ్‌సీఏలోని ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ల నిర్వహణ ఉంటుంది. రెండు మ్యాచ్ లను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన భద్రత కల్పిస్తామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు