BCCI Strict Guidelines For Players After Constant Failures report
ఇటీవల టెస్టుల్లో టీమ్ఇండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ కావడంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ల కుటుంబ సభ్యుల బసను నియంత్రించడం అనేది తీసుకున్న కీలక నిర్ణయాలలో ఒకటి
స్పోర్ట్స్ నౌ ప్రకారం.. విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలిసి ఎక్కువ కాలం ఉంటే అది వారి ప్రదర్శన పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని బీసీసీఐ భావిస్తోందట. అందువల్ల.. ఆటగాళ్లతో కుటుంబాలు గడిపే సమయాన్ని పరిమితం చేస్తూ 2019కి ముందు ఉన్న రూల్‌ని మళ్లీ ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తోన్నట్లు సమాచారం. 45 రోజుల విదేశీ పర్యటనలో రెండు వారాల పాటు ఆటగాళ్లతో పాటు కుటుంబాలు, ముఖ్యంగా భార్యలు మాత్రమే ఉండేందుకు బీసీసీఐ అనుమతినిస్తుంది.
అంతే కాదు.. ఇక పై ప్రతి ఆటగాడు జట్టులోని ఇతర సభ్యులతో కలిసి జట్టు బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఒంటరిగా ప్రయాణించడం ఇక కుదరదు. దీని వల్ల జట్టులో ఐక్యత, స్ఫర్తిని పెంపొందుతుందని భావిస్తున్నారు. బీసీసీఐ సహాయక సిబ్బంది కాంట్రాక్టులను గరిష్టంగా మూడేళ్లుగా నిర్ణయించింది.
న్యూజిలాండ్‌తో స్వదేశంలో, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లను వరుసగా ఓడిపోయిన తర్వాత.. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డోస్‌చాట్‌లతో సహా అతని మద్దతు జట్టు పనితీరుపై విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
విమాన ప్రయాణ సమయంలో 150 కిలోల బరువు దాటితే ఆటగాళ్ల లగేజీకి బీసీసీఐ చెల్లించడం మానుకోవాలని నివేదిక పేర్కొంది. ఆ ఖర్చును ఆటగాళ్లు స్వయంగా భరించాలని కోరారు.
🚨 NEW GUIDELINES FROM BCCI. 🚨
– Cricketers’ wives will not be able to stay for the entire tour.
– A cricketer’s family can stay for a maximum of 2 weeks during a 45 day tour.
– Every player needs to travel by team bus, separate travelling not allowed. (Abhishek Tripathi). pic.twitter.com/ysCyHRguCO— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2025