T20 World Cup 2024 : హార్దిక్ పాండ్య‌కు షాక్‌? వైస్ కెప్టెన్‌గా పంత్‌?

ఐపీఎల్ ముగిసిన వారం వ్య‌వ‌ధిలోనే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 క్రికెట్ అభిమానుల‌ను అల‌రించ‌నుంది.

ఐపీఎల్ ముగిసిన వారం వ్య‌వ‌ధిలోనే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 క్రికెట్ అభిమానుల‌ను అల‌రించ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జూన్ 2న ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో ఈ టోర్నీలో పాల్గొనే జ‌ట్లు అన్ని త‌మ ఆట‌గాళ్ల వివ‌రాల‌ను మే 1లోగా అంద‌జేయాల‌ని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డెడ్‌లైన్ విధించింది. ఇప్ప‌టికే న్యూజిలాండ్ జ‌ట్టు త‌మ 15 మంది స‌భ్యులు గ‌ల స్వ్కాడ్‌ను ప్ర‌క‌టించింది.

ఇక భార‌త జ‌ట్టును సెల‌క్ట‌ర్లు ఒక‌టి లేదా రెండు రోజుల్లో వెల్ల‌డించ‌నున్నారు. అయితే.. తుది జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్ అగార్కర్, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లు  ఇప్ప‌టికే ఖ‌రారు చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా వైస్ కెప్టెన్సీ రేసులో రిష‌బ్ పంత్ ఉన్న‌ట్లు క్రిక్‌బ‌జ్ ఓ క‌థ‌నంలో తెలిపింది.

Kaviya Maran : ‘అయ్యో భ‌గ‌వంతుడా..?’ అంటూ కావ్యా పాప రియాక్ష‌న్.. ఇలా చేస్తార‌ని అనుకోలేదు!

నిన్న‌టి వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ‌కు డిప్యూటీగా వ్య‌వ‌హరించిన హార్దిక్ పాండ్య పై వేటు వేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో హార్దిక్ పూర్తిగా తేలిపోయాడు. అటు కెప్టెన్‌గా ఇటు ఆట‌గాడిగా విఫ‌లం అయ్యాడు. అత‌డి నాయ‌క‌త్వంలో ముంబై వ‌రుస ప‌రాజ‌యాల‌ను చ‌విచూస్తోంది.

ఇక ఆల్‌రౌండ‌ర్ పాత్ర‌కు అత‌డు న్యాయం చేయ‌లేక‌పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని టీమ్ఇండియా వైస్ కెప్టెన్సీ నుంచి త‌ప్పించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Virat Kohli : 500 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లి.. డేవిడ్ వార్న‌ర్ రికార్డు స‌మం

అటు పంత్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 10 మ్యాచులు ఆడ‌గా ఐదు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. మ‌రో ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. మొత్తంగా 10 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు