టెస్టు క్రికెట్ ఆడే ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌..! మ్యాచ్ ఫీజు పెంపు, బోనస్‌లు.. ఒక్క టెస్ట్ ఆడితే ఎంతొస్తుందంటే?

వ‌న్డేలు, టీ20ల రాక‌తో టెస్టు క్రికెట్‌కు ఆద‌ర‌ణ త‌గ్గిపోతుంది.

BCCIs Incentive Plan For Test Cricket Report

BCCI : వ‌న్డేలు, టీ20ల రాక‌తో టెస్టు క్రికెట్‌కు ఆద‌ర‌ణ త‌గ్గిపోతుంది. కొంద‌రు ఆట‌గాళ్లు సైతం వివిధ దేశాల్లో నిర్వ‌హించే టీ20 లీగులు ఆడేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు గానీ టెస్టు క్రికెట్ ఆడేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇందుకు భార‌త ఆట‌గాళ్లు ఏం మిన‌హాయింపు కాదు. సెంట్ర‌ల్‌ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆట‌గాళ్లు అంద‌రూ ప్ర‌స్తుతం జాతీయ జ‌ట్టులో ఆడ‌క‌పోతే దేశ‌వాలీ క్రికెట్‌లో ఆడాల్సి ఉంటుంద‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఆట‌గాళ్లు బీసీసీఐ ఆదేశాల‌ను సైతం పెడ‌చెవిన పెట్టారు.

ఈ క్ర‌మంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. రెడ్‌బాల్ క్రికెట్ వైపు మ‌ళ్లించేందుకు ఆట‌గాళ్ల‌కు మ‌రిన్ని బోన‌స్‌ల‌తో పాటు టెస్టుల మ్యాచ్ ఫీజుల‌ను పెంచే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో ఒక ఆట‌గాడు అన్ని టెస్టులు ఆడితే చెల్లించే బోన‌స్‌లు ఇందులో చేర్చ‌వ‌చ్చున‌ని నివేదిక పేర్కొంది.

Also Read : టికెట్ కలెక్టర్ ఉద్యోగానికి ఎంఎస్ ధోనీ.. అపాయింట్‌మెంట్ లెటర్ వైరల్

ఉద‌హార‌ణ‌కు ఎవ‌రైనా ఆట‌గాడు ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అన్ని టెస్ట్ సిరీస్‌లు ఆడితే అత‌డికి వార్షిక కాంట్రాక్ట్ కాకుండా అద‌నంగా రివార్డు అందించనున్నారు. ఆట‌గాళ్లు ఎక్కువ‌గా రెడ్ బాల్ క్రికెట్‌ను ఆడేలా చేసేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. అని బీసీసీఐ వ‌ర్గాలు తెలిపిన‌ట్లు తెలుస్తోంది.

ఈ కొత్త రెమ్యున‌రేష‌న్ మోడ‌ల్‌ను అన్ని పార్టీలు ఆమోదించిన‌ట్ల‌యితే ఐపీఎల్ 2024 త‌రువాత అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని నివేదిక పేర్కొంది. ప్ర‌స్తుతం బీసీసీఐ ఒక్కొ టెస్టు మ్యాచ్‌కు ఫీజుగా రూ.15ల‌క్ష‌లు, వ‌న్డేకు రూ.6ల‌క్ష‌లు, టీ20ల‌కు రూ.3ల‌క్ష‌లు చెల్లిస్తోంది. కొత్త రెమ్యున‌రేష‌న్ మోడ‌ల్‌లో దీనిని స‌వ‌రించ‌వ‌చ్చు.

Also Read: టీ20 క్రికెట్‌లో పెను విధ్వంసం.. చ‌రిత్ర సృష్టించిన న‌మీబియా ఆట‌గాడు

రాంచీ టెస్టు మ్యాచ్‌లో విజ‌యం సాధించిన అనంత‌రం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ అత్యంత క‌ఠిన‌మైన‌ది అని చెప్పాడు. ఈ ఫార్మాట్‌లో గెల‌వాల‌నే కోరిక ఉన్న ఆట‌గాళ్ల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పాడు. ఆస‌క్తి చూప‌ని ఆట‌గాళ్ల‌ను ఆడించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నాడు. యువ ఆట‌గాళ్లు సీనియ‌ర్ల స్థానాల‌ను భ‌ర్తీ చేశార‌న్నారు.

ట్రెండింగ్ వార్తలు