MS Dhoni : టికెట్ కలెక్టర్ ఉద్యోగానికి ఎంఎస్ ధోనీ.. అపాయింట్‌మెంట్ లెటర్ వైరల్
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని క్రికెట్ అభిమాని భారత దేశంలో ఉండడు

Dhoni appointment letter for ticket collector job goes viral
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని క్రికెట్ అభిమాని భారత దేశంలో ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. విజయవంతమైన కెప్టెన్లలలో అతడు ఒకడు. మూడు ఐసీసీ ట్రోఫీ(టీ20 ప్రపంచకప్ 2007, వన్డే ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013)లను అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. అతడి సారథ్యంలో భారత్ టెస్టుల్లోనూ నంబర్ వన్‌గా నిలిచింది.
కాగా.. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ రాంచీ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ ధోనికి సంబంధించిన ఓ అపాయింట్‌మెంట్ లెటర్‌ను చూపించింది. క్రికెట్‌లోకి రాకముందు ధోని భారతీయ రైల్వేస్‌లో ఉద్యోగం చేసేవాడు. ఇందుకు సంబంధించిన అపాయింట్‌మెంట్ ను రాంచీ టెస్టు మధ్యలో బ్రాడ్‌కాస్టర్ చూపించగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pro Kabaddi League 2024 : సెమీస్‌కు హర్యానా స్టీలర్స్.. గుజరాత్ జెయింట్స్‌కు ఘోర పరాభవం
ఖరగ్ పూర్ లో ధోని టికెట్ కలెక్టర్ గా పనిచేసేవాడు. అయితే అది తన ప్రపంచం కాదు, క్రికెటర్ కావాలన్నది అతడికల. ఈ క్రమంలో అతడు తన కలను నెరవేర్చుకోవడానికి రైల్వే ఉద్యోగం వదిలి బ్యాట్ పట్టాడు. డిసెంబర్ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ధోని.. తనదైన శైలిలో రాణించాడు. 2020 ఆగస్టు 15న ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.
The first appointment letter of MS Dhoni. (JioCinema). pic.twitter.com/nrr53fDbhB
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
గతేడాది సీఎస్‌కే కప్పును అందించిన ధోని ఐపీఎల్‌లో అత్యధిక సార్లు టైటిట్లు అందుకున్న జాబితాలో రోహిత్ శర్మతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. వీరిద్దరు చెరో ఐదు సార్లు కెప్టెన్లుగా టైటిళ్లు అందుకున్నారు. ఐపీఎల్ 2023 అనంతరం మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు.
Jan Nicol Loftie Eaton : టీ20 క్రికెట్‌లో పెను విధ్వంసం.. చరిత్ర సృష్టించిన నమీబియా ఆటగాడు