Rohit Sharma: మమ్మల్నే అంటారా? అంటూ రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్

Rohit sharma: భారత్‌లో సిరీస్ ఉంటే మొదటి రోజు నుంచే పిచ్‌లపై నిందలు వేస్తుంటారని...

Rohit sharma

Rohit Sharma: భారత పిచ్‌లపై విమర్శలు చేసే వారికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగా బదులిచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం.

అతి త‌క్కువ బంతుల్లో ఫ‌లితం తేలిన మ్యాచుల్లో భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ తొలి స్థానంలో నిలిచింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 642 బంతుల్లోనే మ్యాచ్ ముగిసిన రికార్డు ఎన్నడూలేదు. ఈ మ్యాచ్ ద‌క్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదిక‌గా జరిగింది.

దీంతో భారత్ పిచ్‌లపై నిందలు వేసేవారి గురించి రోహిత్ శర్మ స్పందిస్తూ… భారత పిచ్‌లపై ఫిర్యాదులు చేసేవారు అలాంటివి చేయకుండా ఉంటే తనకు కూడా ఇలాంటి వికెట్‌పై ఆడేందుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవని చెప్పాడు. ఐసీసీ రిఫెరీల్లో పక్షపాత ధోరణి ఉండకూడదనేలా రోహిత్ మాట్లాడాడు.

భారత్‌లో మ్యాచ్ ఉంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రికెటర్లు ఇండియాలోవి అన్నీ స్పిన్ పిచ్‌లని అంటుంటారని గుర్తుచేశాడు. మ్యాచ్ ప్రారంభం కాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని చెప్పాడు. వారు అలాంటి కామెంట్స్ చేయకుండా ఉంటే తాను కూడా పేస్ వికెట్ల గురించి మాట్లాడనని చెప్పాడు.

భారత్‌ పర్యటనకు వచ్చే వారికి కూడా తమకు ఎదురైన సవాళ్లే ఎదురువుతాయని చెప్పాడు. వరల్డ్ కప్ ఫైనల్ పిచ్‌కు తక్కువగా రేటింగ్ ఇచ్చారని తెలిపాడు. ఓ బ్యాటర్ సెంచరీ చేసినాకూడా తక్కువ రేటింగ్ ఎలా ఇస్తారని నిలదీశాడు. భారత్‌లో సిరీస్ ఉంటే మొదటి రోజు నుంచే పిచ్‌లపై నిందలు వేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Jasprit Bumrah : కేప్‌టౌన్‌లో బుమ్రా రికార్డులు.. ఒకే ఒక్క భార‌తీయుడు..!

ట్రెండింగ్ వార్తలు