Bengaluru test Team India first innings score card viral
IND vs NZ 1st Test : 13, 2, 0, 0, 20, 0, 0, 0, 2, 1, 4* చూసి ఇదేదో ఫోన్ నంబర్ అని అనుకుంటే మీరు పొరబడినట్లే. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్కోరు కార్డు. మొత్తం 11 మంది ఆటగాళ్లు కలిసి చేసింది 46 పరుగులే. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. ఇద్దరు అంటే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు.
యశస్వి జైస్వాల్ (13), రిషబ్ పంత్ (20)లు ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులు చేయగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0), యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (0), కేఎల్ రాహుల్ (0), ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (0), రవిచంద్రన్ అశ్విన్ (0) లు డకౌట్లు అయ్యారు. కుల్దీప్ యాదవ్ (2), జస్‌ప్రీత్ బుమ్రా (1) విఫలం కాగా మహ్మద్ సిరాజ్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు, విలియం ఒరోర్కే నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించారు. టిమ్ సౌతీ ఓ వికెట్ సాధించాడు.
IND vs NZ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. శుభ్‌మన్ గిల్ ఎందుకు ఆడడం లేదో తెలుసా?
కాగా.. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో అత్యల్ప స్కోరు ఇది. గతంలో (2020లో) అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా పై భారత్ 36 పరుగులకే ఆలౌటైంది. స్వదేశంలో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
A SCORECARD TO FORGET FOR INDIA. pic.twitter.com/AS6soSPjrv
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 17, 2024