IND vs NZ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. శుభ్‌మన్ గిల్ ఎందుకు ఆడడం లేదో తెలుసా?
ఎట్టకేలకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.

Why is Shubman Gill not playing in India vs New Zealand 1st Test match
ఎట్టకేలకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. బెంగళూరులో భారీ వర్షం కురవడంతో మొదటి రోజు కనీసం టాస్ వేయడానికి కూడా సాధ్యపడలేదు. రెండో రోజు మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడిన జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు టాస్ సందర్భంగా రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. శుభ్‌మన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్‌దీప్ యాదవ్ ను తీసుకున్నట్లు వెల్లడించాడు.
SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్.. డేల్ స్టెయిన్ సంచలన నిర్ణయం..
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గిల్ శతకం బాదాడు. టెస్టుల్లో అతడికి ఇది ఐదో సెంచరీ. అయినప్పటికి అతడు న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు దూరం కావడం పై అతడి ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. అతడు ఎందుకు ఆడడం లేదని ప్రశ్నిస్తున్నారు.
గిల్ 100 శాతం ఫిట్‌గా లేకపోవడంతోనే మ్యాచ్‌లో ఆడడం లేడని కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా ధ్రువీకరించాడు. కాగా.. సిరీస్ ప్రారంభానికి ముందు గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో అతడికి ఈ మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడికి తొలి టెస్టులో స్థానం దక్కలేదని సమాచారం.
భారత్ తుది జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.