Kamran Ghulam : పాకిస్థాన్ నయా బ్యాటింగ్ సంచలనం కమ్రాన్ గులామ్‌ను చెంప దెబ్బ కొట్టిన బౌలర్ హరీస్ రవూఫ్.. పాత వీడియో వైరల్
అరంగ్రేట టెస్టు మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు పాకిస్థాన్ బ్యాటర్ కమ్రాన్ గులామ్.

Kamran Ghulam Was Slapped By Haris Rauf On Field Old Video Viral
అరంగ్రేట టెస్టు మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు పాకిస్థాన్ బ్యాటర్ కమ్రాన్ గులామ్. 29 ఏళ్ల ఈ ఆటగాడు మంగళవారం ఇంగ్లాండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో సుదీర్ఘఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 224 బంతులు ఎదుర్కొన్న అతడు 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 118 పరుగులు చేశాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. కమ్రాన్ గులామ్ కు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కమ్రాన్‌ను హరీస్ రవూఫ్ చెంప దెబ్బ కొట్టాడు.
2022లో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఈ ఘటన జరిగింది. లాహోర్ క్వాలండర్స్ తరుపున హరీస్ రవూఫ్, కమ్రాన్ గులామ్ లు కలిసి ఆడారు. ఓ మ్యాచ్‌లో రవూఫ్ బౌలింగ్ కమ్రాన్ ఓ క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో రవూఫ్ అసహనం వ్యక్తం చేశాడు.
PAK vs ENG : శతకంతో చెలరేగిన కమ్రాన్ గులామ్.. బాబర్ ఆజం ఏమన్నాడంటే..?
ఆ తరువాత హరిస్ ఓ వికెట్ తీశాడు. వికెట్ తీసిన ఆనందంలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అతడిని అభినందించడానికి వచ్చిన కమ్రాన్ చెంప పై అప్పటికే అతడిపై అసహనంతో ఉన్న హరీస్ రవూఫ్ గట్టిగా కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2020 దేశీయ సీజన్‌లో కమ్రాన్ గులామ్ 1249 పరుగులతో జాతీయ రికార్డును బద్ధలు కొట్టాడు. చాన్నాళ్ల నిరీక్షణ తరుపున అతడికి జాతీయ జట్టులో చోటు దక్కింది. పాక్ జట్టు 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన అతడు అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
SL vs WI : 5, 7, 4, 0, 14, 4, 20, 1, 7, 16, 5.. వెస్టిండీస్ ఫోన్ నంబర్ ఇదా!
సాయిమ్ అయూబ్ (77)తో కలిసి మూడో వికెట్ 149 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తరువాత రిజ్వాన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు. కాగా.. అరంగ్రేటం టెస్టులో శతకం సాధించిన 13వ పాకిస్థాన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు కమ్రాన్ గులామ్.
Time when Harris Rauf Slapped Kamran Ghulam in PSL pic.twitter.com/U3Y9N7rKT9
— Shah (@ipagshah00) October 15, 2024