SRH : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు షాక్‌.. డేల్ స్టెయిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు షాక్ త‌గిలింది.

SRH : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు షాక్‌.. డేల్ స్టెయిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..

Dale Steyn To Leave SRH As Bowling Coach Ahead Of IPL 2025 Auction

Updated On : October 17, 2024 / 10:30 AM IST

Sunrisers Hyderabad : ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు బౌలింగ్ కోచ్ ప‌ద‌వికి ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు డేల్ స్టెయిన్ రాజీనామా చేశాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని స్టెయిన్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. అయితే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ స‌న్‌రైజ‌ర్స్ ఈస్ట‌ర్న్ కేప్ కోచ్‌గా మాత్రం కొన‌సాగ‌నున్న‌ట్లు చెప్పాడు.

ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ బౌలింగ్ కోచ్‌గా ప‌ని చేసే అవ‌కాశం ఇచ్చినందుకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ధ‌న్య‌వాదాలు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఐపీఎల్ 2025కి రాలేను. ఇంత‌టితో ఎస్ఆర్‌హెచ్‌తో నా ప్ర‌యాణం ముగించాల‌ని అనుకుంటున్నాను. అయితే.. ఎస్ఏ20 లీగ్‌లో మాత్రం కొన‌సాగుతాను. అని సోష‌ల్ మీడియాలో డేల్ స్టెయిన్ రాసుకొచ్చాడు.

Kamran Ghulam : పాకిస్థాన్ న‌యా బ్యాటింగ్ సంచ‌ల‌నం క‌మ్రాన్ గులామ్‌ను చెంప దెబ్బ కొట్టిన బౌల‌ర్ హ‌రీస్ ర‌వూఫ్‌.. పాత వీడియో వైర‌ల్‌

గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లోనే డేల్ స్టెయిన్ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో తాత్కాలికంగా కివీస్ ఆల్‌రౌండ‌ర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్‌గా నియ‌మించుకుంది. ఇప్పుడు స్టెయిన్ పూర్తిగా దూరం కావ‌డంతో ఫ్రాంక్లిన్‌ను రెగ్యుల‌ర్ కోచ్‌గా నియ‌మించే అవ‌కాశం ఉంది.