Best Catch In Cricket History Glenn Maxwell Takes A Stunning catch in BBL
మైదానంలో ఫీల్డర్లు చేసే విన్యాసాల గురించి చెప్పాల్సిన పని లేదు. కొన్ని సార్లు నమ్మశక్యంగాని విధంగా క్యాచులు అందుకుంటూ ఉంటారు. ఇక కొత్త ఏడాది తొలి రోజునే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్యాచుల్లో ఒకటి అని నెటిజన్లు అంటున్నారు.
బుధవారం బ్రిస్బేన్ హీట్, మెల్‌బోర్న్ స్టార్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేట్ హీట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బ్రిస్బేన్ ఆటగాళ్లలో మ్యాక్స్ బ్రయాంట్ (48 బంతుల్లో 77 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించారు. టామ్ బాంటన్ (13), కెప్టెన్ కొలిన్ మన్రో (1) దారుణంగా విఫలం కావడంతో ఓ మోస్తరు స్కోరుకే బ్రిస్బేన్ పరిమితమైంది. మెల్‌బోర్న్ బౌలర్లలో స్టీకిటీ రెండు, జోయల్ పారిస్, పీటర్ సిడిల్, ఉసామా మిర్, డాన్ లారెన్స్ తలా ఓ వికెట్ తీశారు.
IND vs AUS 5th test : ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు.. జస్‌ప్రీత్ బుమ్రాను ఊరిస్తున్న 52 ఏళ్ల రికార్డు..
బ్రిస్బేన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో మెక్స్‌వెల్ నమ్మశక్యంగాని క్యాచ్ అందుకున్నాడు. ఈ ఓవర్‌ను డాన్ లారెన్స్ వేశాడు. మొదటి బంతిని విల్‌ప్రెస్ట్‌విడ్జ్ భారీ షాట్ ఆడాడు. బాల్ సిక్స్‌గా వెలుతున్నట్లుగా అనిపించింది. అయితే.. బౌండరీ లైన్ వద్ద ఉన్న మాక్స్‌వెల్ అమాంతం గాల్లోకి ఎగిరి బాల్ పట్టుకున్నాడు. తాను బౌండరీ లైన్ అవతల పడబోతున్న విషయాన్ని గ్రహించి వెంటనే మైదానంలోకి బాల్ ను విసిరేశాడు. అనంతరం మైదానంలో వచ్చి బాల్‌ను అందుకున్నాడు. మాక్స్‌వెల్ విన్యాసాన్ని చూసిన ప్రేక్షకులు సంబ్రమాశ్చర్యాలకు లోనైయ్యారు.
అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని మెల్‌బోర్న్ స్టార్స్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మెల్‌బోర్న్ బ్యాటర్లలో డాన్ లారెన్స్ (38 బంతుల్లో 62 నాటౌట్), కెప్టెన్ మార్కస్ స్టోయినిస్ (48 బంతుల్లో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక అద్భుత క్యాచ్ అందుకున్న మాక్స్‌వెల్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు.
GLENN MAXWELL!
CATCH OF THE SEASON. #BBL14 pic.twitter.com/3qB9RaxHNb
— KFC Big Bash League (@BBL) January 1, 2025