IND vs AUS 5th test : ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు.. జ‌స్‌ప్రీత్ బుమ్రాను ఊరిస్తున్న 52 ఏళ్ల రికార్డు..

ఓ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచే సువ‌ర్ణావ‌కాశం బుమ్రా ముందు ఉంది.

IND vs AUS 5th test : ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు.. జ‌స్‌ప్రీత్ బుమ్రాను ఊరిస్తున్న 52 ఏళ్ల రికార్డు..

IND vs AUS 5th test Jasprit Bumrah eye on historic 52 year old record

Updated On : January 2, 2025 / 11:19 AM IST

సిడ్నీ వేదిక‌గా శుక్ర‌వారం భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు ఐదో టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది. ఓ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచే సువ‌ర్ణావ‌కాశం బుమ్రా ముందు ఉంది. సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో బుమ్రా 6 వికెట్లు తీస్తే చాలు ఈ ఘ‌న‌త అందుకుంటాడు.

ప్ర‌స్తుతం ఈ రికార్డు లెగ్ స్పిన్న‌ర్ బీఎస్ చంద్ర శేఖ‌ర్ పేరిట ఉంది. 1972-73లో ఇంగ్లాండ్ జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఐదు టెస్టుల్లో 35 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో నాలుగు టెస్టుల్లో బుమ్రా 30 వికెట్లు సాధించాడు.

Vinod Kambli : ఆస్ప‌త్రి నుంచి వినోద్ కాంబ్లీ డిశ్చార్జ్‌.. టీమ్ఇండియా జెర్సీ ధ‌రించి..

మ‌రో రికార్డు..
సిడ్నీ టెస్టులో బుమ్రా మూడు వికెట్లు తీస్తే.. ఓ ద్వైపాక్షిక్ష సిరీస్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త పేస్ బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు క‌పిల్ దేవ్ పేరిట ఉంది. క‌పిల్ దేవ్ 1979-80లో పాకిస్థాన్ పై ఆరు టెస్టుల్లో 32 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఓ ద్వై పాకిక్ష టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్లు..

బిఎస్ చంద్ర శేఖ‌ర్ – 1972-73లో ఇంగ్లాండ్ పై 5 టెస్టుల్లో 35 వికెట్లు
వినూ మన్కడ్ – 1951-52లో ఇంగ్లాండ్ పై 5 టెస్టుల్లో 34 వికెట్లు
సుభాష్ గుప్తే – 1955-56లో న్యూజిలాండ్ పై 5 టెస్టుల్లో 34 వికెట్లు
కపిల్ దేవ్ – 1979-80లో పాకిస్థాన్ పై 6 టెస్టుల్లో 32 వికెట్లు
హర్భజన్ సింగ్ – 2000-01లో ఆస్ట్రేలియా పై 3 టెస్టుల్లో 32 వికెట్లు
రవి చంద్ర‌న్ అశ్విన్ – 2020-21లో ఇంగ్లాండ్ పై 4 టెస్టుల్లో 32 వికెట్లు
బిషన్ సింగ్ బేడీ – 1977-78లో ఆస్ట్రేలియా పై 5 టెస్టుల్లో 31 వికెట్లు
రవిచంద్ర‌న్ అశ్విన్ – 2015-16లో ద‌క్షిణాఫ్రికా పై 4 టెస్టుల్లో 31 వికెట్లు
జస్ ప్రీత్ బుమ్రా – 2024-25లో ఆస్ట్రేలియా పై 4 టెస్టుల్లో 30 వికెట్లు*

IND vs AUS 5th Test : ఆసీస్‌తో ఐదో టెస్టుకు ముందు భార‌త్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేస‌ర్ ఔట్‌..

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో నాలుగు మ్యాచులు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో భార‌త్‌, రెండో మ్యాచులో ఆసీస్ విజ‌యాలు సాధించాయి. మూడో మ్యాచ్ డ్రా గా ముగిసింది. నాలుగో మ్యాచ్‌లో ఆసీస్ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఆసీస్ 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. సిరీస్‌లో ఆఖ‌రి కీల‌కమైన ఐదో టెస్టు మ్యాచ్ సిడ్నీ వేదిక‌గా శుక్ర‌వారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ స‌మం చేయాల‌ని భార‌త్ భావిస్తోండ‌గా.. ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాల‌ని ఆసీస్ ఆరాట‌ప‌డుతోంది.