IND vs AUS 5th Test : ఆసీస్‌తో ఐదో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్..
సిడ్నీ టెస్టుకు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.

IND vs AUS Akash Deep out of Sydney Test with back issue
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. వెన్నుగాయంతో అతడు బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే సిడ్నీ టెస్టుకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ధ్రువీకరించాడు. అయితే.. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.
బ్రిస్బేన్, మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో ఆకాశ్ దీప్ ఆడాడు. ఈ రెండు మ్యాచుల్లో అతడు ఐదు వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతడి బౌలింగ్‌లో వచ్చిన పలు క్యాచులను ఫీల్డర్లు జారవిడచడంతో అతడు ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు.
28 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 87.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతడి పని భారం కారణంగా గాయపడ్డాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఉండే కఠినమైన పిచ్‌లు ఫాస్ట్ బౌలర్ల మోకాలి, చీలమండల, వెన్ను సమస్యలనుకు కారణం అవుతాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆకాశ్ దీప్ స్థానంలో హర్షిత్ రానా లేదా ప్రసిద్ధ్ కృష్ణలు తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.
తుది జట్టు పై గౌంభీర్ కీలక వ్యాఖ్యలు..
సిడ్నీ టెస్టులో భారత తుది జట్టు పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరెవరు ఆడతారు అనే దానిపై అతడు స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో ఉంటాడా? అన్న ప్రశ్న అతడికి ఎదురైంది. రేపు టాస్ వేయడానికి ముందు పిచ్‌ను పరిశీలిస్తామని ఆ తరువాత తుది జట్టు కూర్పు పై ఓ క్లారిటీ వస్తుందని గంభీర్ చెప్పాడు.
రోహిత్ శర్మ తుది జట్టులో ఉంటాడు అన్నది మాత్రం చెప్పలేదు. అదే సమయంలో మీడియా సమావేశానికి గంభీర్ ఒక్కడే రావడం కెప్టెన్ రోహిత్ శర్మ రాకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో రేపటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడేది అనుమానంగా మారింది.
🚨 AKASHDEEP RULED OUT OF THE SYDNEY TEST MATCH…!!! 🚨 pic.twitter.com/GRsmF4jyT8
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 2, 2025