IND vs AUS 5th Test : సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడతాడా? ఆడడా?.. గంభీర్ షాకింగ్ ఆన్సర్.. డ్రెస్సింగ్ రూమ్‌లో లుకలుకలపై..
మ్యాచ్‌కు ఒక రోజు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాల్గొన్నాడు.

IND vs AUS Gambhir Breaks Silence On Dressing Room Leaks and rohit playing or not in final test
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా శుక్రవారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో పలు ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు వైరల్ అవుతున్నాయి.
టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం వేడెక్కిందని, సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్‌కు విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై గౌంభీర్ స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన చర్చలు అక్కడి వరకే పరిమితం అని అవి బయటకు రాకూడని సూచించాడు. అవన్నీ అవాస్తవాలేనని అన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శన పైనే తాము డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించినట్లు తెలిపాడు.
ఇది చాలా ముఖ్యమైనదని అన్నాడు. ఇక కోచ్‌కు ఆటగాళ్ల మధ్య జరిగిన చర్చలు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కావాలి. బయటకు రాకూడదు. నిజాయతీ కలిగిన వ్యక్తులు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నంత వరకు భారత క్రికెట్ జట్టు సురక్షితమైన వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది అని గంభీర్ చెప్పాడు.
ఓ జట్టుగా తాము ఏం చేయాలి. మ్యాచులను ఎలా గెలవాలి అనేదానిపైనే చర్చించాం. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మతో టెస్ట్ మ్యాచ్‌లను ఎలా గెలవాలనే వ్యూహాల గురించి తప్ప మరేలాంటి చర్చలు వారితో చేయలేదన్నాడు.
Team India : డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునేందుకు భారత్‌కు ఆఖరి ఛాన్స్..? ఎలాగంటే?
సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడతాడా లేదా..?
గత కొన్నాళ్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ రిటైర్‌మెంట్ తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐదో టెస్టు మ్యాచులో అతడిని తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడతాడా? లేదా? అన్న ప్రశ్న గంభీర్‌కు ఎదురైంది. మ్యాచుకు ముందు పిచ్‌ను పరిశీలిస్తామని, ఆ తరువాతే తుది జట్టును ఎంచుకుంటామని గంభీర్ చెప్పాడు.
ఇదిలా ఉంటే.. మ్యాచుకు ముందు నిర్వహించే మీడియా సమావేశాల్లో హెడ్ కోచ్‌తో పాటు కెప్టెన్ సైతం పాల్గొంటారు. అయితే.. గంభీర్ ఒక్కడే మీడియా సమావేశానికి రావడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. దీనిపై గంభీర్ మాట్లాడుతూ.. కెప్టెన్ కూడా ఖచ్చితంగా రావాలన్న సాంప్రదాయం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. హెడ్ కోచ్‌గా తాను వచ్చానని, అది సరిపోతుందని చెప్పాడు.
రోహిత్ శర్మ మీడియా సమావేశానికి రాకపోవడం, గంభీర్ వ్యాఖ్యలు చూస్తుంటే హిట్‌మ్యాన్ రేపటి టెస్టు మ్యాచ్ ఆడకపోవచ్చునని పలువురు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందని శుక్రవారం ఉదయం టాస్ సమయానికి తేలిపోతుంది.
Question – will Rohit Sharma play tomorrow?
Gautam Gambhir – we will take the Playing XI call at the toss after looking at the pitch tomorrow. pic.twitter.com/7QoexVkRwZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 2, 2025