Team India : డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునేందుకు భారత్‌కు ఆఖరి ఛాన్స్..? ఎలాగంటే?
అయినప్పటికి ఇంకా భారత జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఉన్నాయి

India World Test Championship Final chances Only one Scenario there
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ 184 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్ సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకబడి పోయింది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అదే సమయంలో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మరింత మెరుగు అయ్యాయి.
వచ్చే ఏడాది లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2023-25) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దక్షిణాప్రికా జట్టు ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. నాలుగో టెస్టులో ఓటమితో భారత అవకాశాలు సన్నగిల్లాయి. అటు ఆస్ట్రేలియా మరో టెస్టు మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆసీస్ మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచినా చాలు.
Gautam Gambhir : గంభీర్‌కు ఈ సిరీసే ఆఖరిది కానుందా.. సిడ్నీ పరీక్షలో గంభీర్ నెగ్గెనా?
అయినప్పటికి ఇంకా భారత జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఉన్నాయి. అటు శ్రీలంకకు అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఈ రెండు జట్లు మిగిలిన టెస్టుల్లో విజయాలు సాధించడంతో పాటు ఇతర సమీకరణాలు కలిసి రావాల్సి ఉంది.
భారత జట్టు విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి జరగనున్న ఐదో టెస్టు మ్యాచులో విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న రెండు మ్యాచుల టెస్టు సిరీస్ డ్రా గా ముగియాల్సి ఉంటుంది. లేదంటే రెండు టెస్టుల్లో శ్రీలంక ఒక్క టెస్టు గెలిచినా ఏమీ కాదు. అప్పుడు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటంది.
ఒక వేళ భారత జట్టు సిడ్నీ టెస్టు మ్యాచులో ఓడినా, లంకతో రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచులో గెలిచినా.. టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్ దారులు మూసుకుపోయినట్లే.
The WTC Final scenario for India. 🇮🇳 pic.twitter.com/TxVzqGABh0
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2024