Rohit – Kohli : భార‌త క్రికెట్‌కు మీ సేవ‌లు ఇక చాలు.. హ్యాపీ రిటైర్‌మెంట్ ‘రో-కో’ పై ర‌విశాస్త్రి కామెంట్స్‌ వైర‌ల్‌..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు త‌మ పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నారు

Rohit – Kohli : భార‌త క్రికెట్‌కు మీ సేవ‌లు ఇక చాలు.. హ్యాపీ రిటైర్‌మెంట్ ‘రో-కో’ పై ర‌విశాస్త్రి కామెంట్స్‌ వైర‌ల్‌..

IND vs AUS Fans ask Virat Kohli and Rohit Sharma to retire from cricket after the duo fails in 4th test

Updated On : December 30, 2024 / 10:38 AM IST

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు త‌మ పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నారు. మెల్‌బోర్న్ టెస్టులోనూ ఈ ఇద్ద‌రూ విఫ‌లం అయ్యారు. ఆస్ట్రేలియా 340 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. త‌మ అనుభ‌వం, ఆట‌తో ఈ భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో జ‌ట్టును ముందుండి ‘రో-కో’ ద్వ‌యం న‌డిపిస్తార‌ని అభిమానులు ఆశించారు. అయితే.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 9 ప‌రుగులు, విరాట్ కోహ్లీ 5 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరుకున్నారు.

ఈ క్ర‌మంలో వీరిద్ద‌రిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ఇద్ద‌రూ ఇన్నాళ్లు టీమ్ఇండియాకు అందించిన సేవ‌లు ఇక చాలు అని, వీరిద్ద‌రు రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిన స‌మ‌యం ఆసన్న‌మైంద‌ని అంటున్నారు.

15 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచ‌రీ..

రోహిత్ శ‌ర్మ గ‌త కొన్నాళ్లుగా టెస్టుల్లో దారుణంగా విఫ‌లం అవుతున్నాడు. వేగంగా ఆడాల‌ని ప్ర‌య‌త్నిస్తూ ఔట్ అవుతున్నాడు. ప‌దే ప‌దే ఇలా ఔట్ అవుతున్నా కానీ త‌న పంతాను మార్చుకోవ‌డం లేదు. దీంతో అత‌డు జ‌ట్టుకు భారంగా మారుతున్నాడు. గ‌త 15 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ కేవ‌లం ఒకే ఒక హాఫ్ సెంచ‌రీ చేశాడు. అది కూడా స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కావ‌డం గ‌మ‌నార్హం. ఆ మ్యాచ్‌లో 52 ప‌రుగుల‌తో రాణించాడు.

IND vs AUS : టీమిండియాకు బిగ్ షాక్.. ఇలా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆశలు గల్లంతే..!

ఇక ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు రోహిత్ శ‌ర్మ‌. ఆ మ్యాచ్‌లో భార‌త్ గెలుపొందింది. రెండో టెస్టు మ్యాచ్‌కు రోహిత్ శ‌ర్మ అందుబాటులోకి వ‌చ్చాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 3, 6 ప‌రుగుల‌తో తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోయింది. ఇక మూడో టెస్టులో 10 ప‌రుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. నాలుగో టెస్టు మ్యాచులో 3, 9 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిన ఆస‌న్న‌మైంద‌ని అభిమానుల‌తో పాటు ప‌లువురు మాజీ క్రికెటర్లు అంటున్నారు.

17 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక సెంచ‌రీ..

రోహిత్ శ‌ర్మ‌తో పోలిస్తే విరాట్ కోహ్లీ కాస్త న‌యం అనిపించ‌క‌మాన‌దు. కోహ్లీ గ‌త 17 ఇన్నింగ్స్‌ల్లో ఓ సెంచ‌రీ, ఓ హాఫ్ సెంచరీ న‌మోదు చేశాడు. అయితే.. అత‌డు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బ‌ల‌హీన‌త‌ను అధిగ‌మించ‌లేక‌పోతున్నాడు. ఈ బ‌ల‌హీన‌త‌తో ప‌దే ప‌దే ఔట్ అవుతున్నారు.

IND vs AUS 4th test : మూడు క్యాచులు మిస్ చేసిన య‌శ‌స్వి జైస్వాల్‌.. రోహిత్ శ‌ర్మ తీరు పై విమ‌ర్శ‌లు..

ఆసీస్‌తో మొద‌టి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీతో ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్లే క‌నిపించిన కోహ్లీ ఆ త‌రువాత అదే జోరును కొన‌సాగించ‌డంలో విఫ‌లం అయ్యాడు. రెండో టెస్టులో 7,11 మూడో టెస్టులో 3, నాలుగో టెస్టులో 36, 5 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో కోహ్లీ సైతం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికితే బాగుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. వీరిద్ద‌రి స్థానాల్లో కుర్రాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌నే డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

ర‌విశాస్త్రి కీల‌క వ్యాఖ్య‌లు..

రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాల‌నే డిమాండ్ పై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ర‌విశాస్త్రి స్పందించాడు. కోహ్లీ త‌న కెరీర్‌ను కొన‌సాగించాల‌ని కోరాడు. అదే స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ ఈ సిరీస్ ముగిశాక ఏదో ఒక నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నాడు.

రోహిత్ శ‌ర్మ ఫుట్‌వ‌ర్క్ మెరుగ్గా లేద‌న్నాడు. అందుకే ప‌రుగులు రాబ‌ట్టేందుకు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అత‌డు ఔటైన తీరు ఇబ్బందిక‌ర‌మేన‌ని అన్నారు. కోహ్లీ క‌నీసం మ‌రో మూడేళ్లు ఆడే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నాడు. అత‌డి ఫిట్‌నెస్ బాగుంద‌ని చెప్పాడు.