ప‌తిర‌న‌ సూపర్ క్యాచ్.. వార్న‌ర్‌కు దిమ్మతిరిగిపోయింది.. వీడియో వైరల్

సూపర్ మ్యాన్ లా గాల్లోకి దూకి క్యాచ్ పట్టిన తరువాత పతిరనను ధోనీ అభినందించాడు. పతిరన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Matheesha Pathirana

Matheesha Pathirana : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. తొలి నుంచి డేవిడ్ వార్నర్ దూకుడుతో ఆడాడు. జోరుమీదున్న వార్నర్ ను పెవిలియన్ చేర్చాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందేనని ప్రేక్షకులు అనుకుంటున్నవేళ సూపర్ మ్యాన్ లా గాల్లోకి ఎగిరి మతీషా పతిరన అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో వార్నర్ (52) పెవిలియన్ బాట పట్టాడు.

Also Read : IPL 2024 : రావడం ఆలస్యమైనా రచ్చచేయడం మాత్రం కామన్.. విశాఖలో ధోనీ బౌండరీల మోత.. వీడియో చూడండి

పదో ఓవర్లో ముస్తాఫిజుర్ స్లో డెలివరీని వేయగా.. వార్నర్ ఆ బాల్ ను రివర్స్ స్కూప్ ఆడాలని ప్రయత్నించాడు. దీంతో ఆ బాల్ వికెట్ కీపర్ ధోనీకి కొంచెం దూరంగా వేగంగా దూసుకెళ్లింది. ఫోర్ వెళ్లడం ఖాయమనుకుంటున్న సమయంలో పతిరన గాలిలోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. పతిరనా పట్టిన క్యాచ్ కు మహేందర్ సింగ్ ధోనీ, డేవిడ్ వార్నర్ కూడా కంగుతిన్నారు. వార్నర్ తొలుత ఆ బాల్ ను క్యాచ్ అందుకున్నాడంటే నమ్మలేకపోయాడు. ఆశ్యర్యంగా అంపైర్ వైపు చూస్తూ ఉండిపోయాడు. వెంటనే తేరుకొని వార్నర్ పెవిలియన్ బాటపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : GT vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ విజయ దుందుభి

సూపర్ మ్యాన్ లా గాల్లోకి దూకి క్యాచ్ పట్టిన తరువాత పతిరనను ధోనీ అభినందించాడు. పతిరన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. కొందరు.. పతిరన నీకేమైనా రెక్కలున్నాయా ఏంటి అంటూ ప్రశ్నిస్తుండగా.. మరికొందరు.. నీలో సూపర్ మ్యాన్ పూనాడా పతిరన? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అధికశాతం మంది నెటిజన్లు అద్భుత క్యాచ్ అందుకున్న పతిరనను అభినందిస్తున్నారు.