Shah Rukh Khan: బాలీవుడ్ ‘సూపర్ స్టార్’ షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘పఠాన్’. భారీ వసూళ్లతో దూసుకెళ్తూ, పాత రికార్డులు చెరిపేస్తోంది ఈ చిత్రం. మరోవైపు ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘జూమే జో పఠాన్’ పాటకు భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి స్టెప్పులేశారు.
Maharashtra: సహజీవనం చేస్తున్న ప్రేయసిని చంపిన ప్రియుడు.. మృతదేహాన్ని బెడ్ కింద దాచి పరార్
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో వీరి స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టులో పాల్గొనేందుకు భారత జట్టు ఢిల్లీ చేరుకుంది. అక్కడ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా ఆటగాళ్లు సరదాగా పఠాన్ పాటకు స్టెప్పులేశారు. కోహ్లీ, జడేజా చేసిన ఈ డ్యాన్స్ గురించి కామెంట్ చేయాల్సిందిగా ఒక నెటిజన్ షారుక్‌ను ట్విట్టర్‌లో కోరాడు. దీనికి షారుక్ ఖాన్ స్పందించాడు. ‘‘నా కంటే బాగా డాన్స్ చేస్తున్నారు. కోహ్లీ, జడేజా నుంచి నేర్చుకోవాలి’’ అని షారుక్ బదులిచ్చారు.
భారత క్రికెట్ జట్టుకు సంబంధించి ప్రస్తుతం టెస్టులు, వన్డేలు, టీ20ల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి టెస్టులో భారత జట్టు భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 17-21 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఐదేళ్ల తర్వాత అక్కడ టెస్ట్ మ్యాచ్ జరగబోతుండటం విశేషం.
They are doing it better than me!! Will have to learn it from Virat And Jadeja!!! https://t.co/q1aCmZByDu
— Shah Rukh Khan (@iamsrk) February 14, 2023