Rohit భయ్యా.. కూతురు ఏడుస్తుందని వెళ్లిపోయాడు Shami: Chahal

  • Publish Date - May 5, 2020 / 05:37 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సెలబ్రిటీలంతా వారి పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులకు మరింత దగ్గర అవుతున్నారు. టైం పాస్ కే చేస్తున్నా ఇనిస్టాగ్రామ్ వేదికగానే ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. రోహిత్ శర్మ ఇతర టీం ప్లేయర్లతో కలిసి లైవ్ లో చాలా సార్లు వీడియో చాట్ లో పాల్గొన్నాడు. 

ఇదే తరహాలో శనివారం మొహమ్మద్ షమీతో కలిసి చాటింగ్ లో ఉండగా డిఫరెంట్ టాపిక్స్ తో డిబేట్ సుదీర్ఘంగా కొనసాగింది. ఆ సమయంలో టెక్నికల్ ఎర్రర్ కారణంగా ఇంటర్నెట్ ఆగిపోవడంతో రోహిత్ ఫ్యాన్స్ పై ఆగ్రహం చూపించాడు. అప్పటికే చాటింగ్ లో నుంచి వెళ్లిపోయిన రోహిత్ శర్మతో బెటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న షమీ మాట్లాడేందుకు ప్రయత్నించగా అప్పటికే లేట్ అయిపోయింది. 

చాహల్ అది గమనించి షమీకి కామెంట్ చేశాడు. షమీ .. రోహిత్ శర్మ వెళ్లిపోయాడు. పాప ఏడుస్తుందేమో అంటూ కామెంట్ చేశాడు. ‘సమైరా ఏడుస్తుంది భయ్యా వెళ్లిపోయాడు’ అని చాహల్ కామెంట్ చేశాడు. లైవ్ సెషన్స్ లో ఫన్నీ కామెంట్లతో రావడం ఇది తొలిసారి కాదు. చాహల్ సోషల్ మీడియాలో రోజంతా యాక్టివ్ గా ఉన్నట్లే అనిపిస్తాడు. ఫ్యామిలీ అంతా కలిసి టిక్ టాక్ వీడియోలు చేసి కూడా పోస్టు చేస్తుంటారు. 

బ్యాటింగ్ స్కిల్స్ పెంచుకోవాలని:
టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తనకు మరింత ప్రాక్టీస్ కావాలని.. మెరుగైన స్కిల్స్ నేర్చుకోవాలని అంటున్నాడు. ‘బ్యాటింగ్ చేయడానికి చాలా సమయం కావాలి. గాయం కారణంగా ముందుగానే ముంబైకు వచ్చేశా. ఫిబ్రవరిలో గాయమైంది అప్పటి నుంచి బ్యాట్ ముట్టుకోలేదు. ఇంకా క్రికెట్ ఆడేందుకు 2నుంచి 3నెలలు పట్టొచ్చు. బ్యాటింగ్ స్కిల్స్ పైన ఫోకస్ చేయాలి’ అని అంటున్నాడు. 

Also Read | Murali Vijayతో డిన్నర్‌కి వెళ్తా.. బిల్లు కట్టను: Ellyse Perry