Virat Kohli : కోహ్లీ క్రికెటర్ కాకపోయుంటే ఏ క్రీడలో రాణించేవాడు..? భువనేశ్వర్ కుమార్ ఏం చెప్పాడంటే..

కోహ్లీ జట్టులో అత్యుత్తమ బౌలర్ అని భావిస్తున్నాడు. అతను బౌలింగ్ చేసినప్పుడు మేము ఎప్పుడూ భయపడతాం. ఎందుకంటే..

Virat Kohli and Bhuvneshwar Kumar

Virat Kohli and Bhuvneshwar Kumar: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఒకవేళ క్రికెటర్ కాకపోయిఉంటే ఏమయ్యేవాడు.? అందుకు సమాధానంగా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఏం చెప్పాడో తెలుసా? విరాట్ కనుక క్రికెటర్ కాకపోయిఉంటే రెజ్లర్ అయ్యేవాడని భువనేశ్వర్ చెప్పాడు. ఇందుకు కారణాన్నికూడా భువనేశ్వర్ చెప్పాడు. కోహ్లీ మైదానంలో బ్యాటింగ్‌తో ఆకట్టుకోవటమే కాకుండా తన దూకుడు వైఖరిని ప్రదర్శిస్తాడు. ఈ కారణంగా అతను క్రికెటర్ కాకపోయిఉంటే డబ్ల్యూడబ్ల్యూఈ‌లో రెజ్లర్‌గా రాణించేవాడని భువనేశ్వర్ చమత్కరించాడు.

ICC World Cup 2023: అలా సాధ్యంకాదు .. హెచ్‌సీఏ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ .. పోలీసులకు తప్పని తిప్పలు

భువనేశ్వర్ ఇంకా మాట్లాడుతూ.. కోహ్లీ జట్టులో అత్యుత్తమ బౌలర్ అని భావిస్తున్నాడు. అతను బౌలింగ్ చేసినప్పుడు మేము ఎప్పుడూ భయపడతాం. ఎందుకంటే.. అతని బౌలింగ్ యాక్షన్ కారణంగా గాయపడతాడేమోననే భయం కలుగుతుంది అంటూ విరాట్ బౌలింగ్‌పై భువనేశ్వర్ చమత్కరించాడు. విరాట్ కోహ్లీ తన అద్భుత బ్యాటింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

ICC World Cup 2023 : ప్ర‌పంచ‌కప్‌లో పాల్గొనే జ‌ట్లు ఇవే.. టీమిండియా ఆడే మ్యాచ్‌ల అప్‌డేట్‌ షెడ్యూల్..

ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి అభిమానులు ఉన్నారు. అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 76 సెంచరీలు చేసి గొప్ప బ్యాటర్లలో ఒకడిగా పేరుగడించాడు. విరాట్‌కు ప్రస్తుతం 34ఏళ్లు. టీమిండియాకు చెందిన ఈ స్టార్ క్రికెటర్.. ఈ  సంవత్సరం అన్ని ఫార్మాట్లలో 17 మ్యాచ్ లు ఆడాడు.  54.66 సగటుతో నాలుగు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలతో 984 పరుగులు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు