Big Blow For RCB Pooja Vastrakar at least two weeks To Miss WPL 2026
RCB : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. శుక్రవారం నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది. ఇక గెలుపు జోష్‌లో ఉన్న ఆర్‌సీబీకి ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మరో రెండు వారాల పాటు ఆటకు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆర్‌సీబీ హెచ్ కోచ్ మలోలన్ రంగరాజన్ వెల్లడించారు.
26 ఏళ్ల పూజా వస్త్రాకర్ చివరి సారిగా టీ20 ప్రపంచకప్ 2024లో ఆడింది. అయితే.. భుజం కారణంగా ఆమె ఆ తరువాత ఆటకు దూరంగా ఉంది. కాగా.. డబ్ల్యూపీఎల్ వేలంలో ఆర్‌సీబీ ఈ పేస్ ఆల్‌రౌండర్ ను రూ.85లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ సమయానికి ఆమె కోలుకుంటుందని భావించింది. అయితే.. ఇప్పుడు ఆమె తొడ కండరాల గాయంతో బాధపడుతోంది.
Virat Kohli : అర్ష్‌దీప్ సింగ్ రన్నింగ్ ను అనుకరించిన కోహ్లీ.. వీడియో వైరల్
‘భుజం గాయం కారణంగా పూజా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పునరావాసంలో ఉంది. ఈ గాయం నుంచి కోలుకుంది. అయితే..దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేయంతో మరికొన్నాళ్ల పాటు ఆమెకు విశ్రాంతి అవసరం. ఈ గాయం నుంచి కోలుకునేందుకు మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. అయితే.. ఆమె ఖచ్చితంగా ఏ తేదీన మ్యాచ్ ఆడుతుందనే విషయాలను చెప్పడం కష్టం.’ అని మలోలన్ రంగరాజన్ తెలిపారు.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ముంబై, ఆర్‌సీబీ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ తరువాత నదైన్ డిక్లెర్క్ (44 బంతుల్లో 63 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 155 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ సరిగ్గా 20 ఓవర్లలో అందుకుంది.