Ind vs Pak Match Boycott: పాక్ మ్యాచ్ బాయ్ కాట్ చర్చ.. రంగంలోకి కోచ్ గౌతమ్ గంభీర్

Ind vs Pak Match Boycott: ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి హైల్టోజ్ మ్యాచ్ జరగనుంది.

Ind vs Pak Match Boycott

Ind vs Pak Match Boycott: ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి హైల్టోజ్ మ్యాచ్ జరగనుంది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి ఘటన తరువాత ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. దీంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్దెత్తున డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశంతో ఎలాంటి మ్యాచ్‌లు ఆడకూడదని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: IND vs PAK : నేడే పాక్‌తో భార‌త్ మ్యాచ్‌.. ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా? హెడ్‌-టు-హెడ్ రికార్డులు ఇవే..

ఓ వైపు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ట్రెండ్ కొనసాగుతుండగా.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోనూ బాయ్‌కాట్ మీద వస్తున్న డిమాండ్లపై చర్చ జరిగిందట. ఇటీవల లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో భారత మాజీ ఆటగాళ్ల జట్టు పాకిస్థాన్‌తో సెమీస్ మ్యాచ్ బహిష్కరించింది. ఆ సమయంలో స్పాన్సర్లు సైతం వీరి నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఇదే తీరును ప్రస్తుతం ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలన్న డిమాండ్లు రావడంతో డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లు సైతం కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. దీంతో టీమిండియా ఆటగాళ్లపై సోషల్ మీడియా ప్రభావం పడకుండా మేనేజ్మెంట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లతో ఈ విషయంపై చర్చించి.. క్రికెటర్లను ప్రొపెషనల్‌గా ఉండాలటూ సూచించారట.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందురోజు శనివారం ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌లో టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ హాజరయ్యాడు. వాస్తవానికి మ్యాచ్ స్థాయిని పరిగణలోకి తీసుకొని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే, గాయపడిన ప్రజల భావాలను ఆటగాళ్లు మైదానంలో వ్యక్తం చేస్తారా అని మీడియా ర్యాన్ టెన్ డొస్చొట్ ను ప్రశ్నించగా.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. భారత ప్రజల భావాలను, బాధలను ఆటగాళ్లు అర్ధం చేసుకుంటారు. కానీ, కేంద్రం విధానం ఎలా ఉంటే అలా నడుచుకోవాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడూ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పారు.

నెట్టింట బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగుతున్న వేళ.. డ్రెస్సింగ్ రూంలో గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు చేసిన సూచనలు గురించి రైన్ టెన్ డోస్చాట్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ‘‘ప్రజల భావోద్వేగాలు, బలమైన భావాలు గురించి స్పష్టమైన అవగాహన ఉంది. అయితే, మన నియంత్రణలో లేని విషయాల గురించి చింతిచవద్దు. కేవలం క్రికెట్ పైనే దృష్టి పెట్టండి. భావోద్వేగాలను పక్కన పెట్టండి. అంటూ గంభీర్ ఆటగాళ్లకు సూచించినట్లు రైన్ టెన్ డోస్చోట్ చెప్పారు.