Breastfeeding Olympians
Breastfeeding Olympians : ఒలింపిక్స్ 2021 క్రీడలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో..ఈ క్రీడలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. ఒలింపిక్ సంఘం పలు ఆంక్షలు, నిబంధనలు విధిస్తోంది. తాజాగా…బ్రెస్ట్ ఫీడింగ్ తల్లులు..తమ పిల్లలను వెంట తీసుకరావొచ్చని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కెనడా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి..కిమ్ గౌచర్ చేసిన విజ్ఞప్తికి IOC స్పందించింది. తనకు మూడు నెలల కూతురు ఉందని, తనతో పాటు తీసుకొచ్చేందుకు అనుమతినివ్వాలని 37 సంవత్సరాల కిమ్ అభ్యర్థించింది. తన విన్నపాన్ని ఒలింపిక్ సంఘం అనుమతినివ్వకపోతే…తాను పోటీలకు దూరం ఉండడమో…తన బిడ్డకు దూరంగా ఉండడమో చేయకతప్పదని వెల్లడించారు.
దీనిపై IOC సానుకూలంగా స్పందించింది. ఎంతో మంది తల్లులు ఒలింపిక్స్ తో సహా ఎన్నో అత్యున్నతస్థాయి టోర్నమెంట్ బరిలోకి దిగుతున్నారని..వీరందరికీ స్వాగతం అంటూ ఓ ప్రకటనలో వెలువడించింది. పిల్లలకు పాలిస్తున్న తల్లులు జపాన్ అడుగుపెట్టవచ్చు…అని ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రత్యేక అనుమతిని మంజూరు చేశారు. ప్రస్తుతం ఐఓసీ నిర్ణయంతో ఎంతో మందికి మార్గం సుగమమైందని చెప్పవచ్చు.