Cameron Green get only 18 crore after he sold 25 crore to kkr
Cameron Green : అందరూ ఊహించినట్లుగానే ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు. రూ.25.20 కోట్లకు అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు. ఐపీఎల్ 2024 మినీ వేలంలో స్కార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.
గ్రీన్‌కు రూ.18 కోట్లే..
మినీ వేలంలో రూ.25.20 కోట్ల ధరకు అమ్ముడుపోయినప్పటికి కూడా కామెరూన్ గ్రీన్‌కు రూ.18 కోట్లు మాత్రమే జీతంగా వెళ్లనుంది. మిగిలిన రూ.7.20 కోట్లు బీసీసీఐ ఖాతాలో పడనున్నాయి.
IPL 2026 Auction : కోహ్లీ టీమ్‌లోకి వెంకటేష్ అయ్యర్.. హోరాహోరీగా పోటీపడిన కేకేఆర్, ఆర్‌సీబీ
He 𝘾𝙖𝙢e, he saw, he’s ready to #KorboLorboJeetbo 👊💜 pic.twitter.com/9Omi7HyWAg
— KolkataKnightRiders (@KKRiders) December 16, 2025
కొంత మంది విదేశీ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనరు. తెలివిగా వారు మినీ వేలంలో పాల్గొని అత్యధికంగా నగదును పొందున్నారు. దీనిపై అన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే మెగా వేలంలో గరిష్టంగా రిటెన్షన్ విలువను మాత్రమే అందజేయాలని బీసీసీఐ నిబంధనను తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే గ్రీన్‌కు రూ.18 కోట్లు మాత్రమే వెళ్లనున్నాయి.
మిగిలిన మొత్తం బీసీసీఐ ఖాతాలో జమ కానుంది. ఇలా వచ్చిన మొత్తాన్నిబీసీసీఐ స్థానిక ఆటగాళ్ల సంక్షేమం కోసం ఖర్చు చేయనుంది.