×
Ad

cameron green : చ‌రిత్ర సృష్టించిన కామెరూన్ గ్రీన్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన విదేశీ ప్లేయ‌ర్‌గా..

ఆస్ట్రేలియా ఆట‌గాడు కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు

cameron green is the most expencive forien player

IPL 2026 Auction : ఆస్ట్రేలియా ఆట‌గాడు కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన విదేశీ ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. అత‌డిని 25.20 కోట్ల‌కు కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ ద‌క్కించుకుంది. ఈ క్రమంలో అతను మిచెల్ స్టార్క్ ను అధిగమించాడు. ఐపీఎల్ 2024 మినీవేలంలో స్కార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.

రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వ‌చ్చిన కామెరూన్ గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు పోటీప‌ట్టాయి. ఆరంభంలో కోల్‌క‌తా, ఆర్ఆర్ పోటీప‌డ‌గా.. ఆ త‌రువాత సీఎస్‌కే వ‌చ్చి చేరింది. మ‌ధ్య‌లో రాజ‌స్థాన్ నిష్క్ర‌మించ‌గా ఆఖ‌రి వ‌ర‌కు చెన్నై, కోల్‌క‌తా పోటీప‌డ‌డంతో 25 కోట్ల‌కు అత‌డి ధ‌ర ప‌లికింది. చివ‌రికి రేసు నుంచి చెన్నై నిష్ర్క‌మించ‌గా కేకేఆర్ అత‌డిని సొంతం చేసుకుంది.

తొలి సెట్‌లో పృథ్వీషా, సర్ఫరాజ్‌ ఖాన్‌, కాన్వే, జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్‌పై ల‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆస‌క్తి చూప‌లేదు