Kohli dismissal
Rohit Sharma Reaction After Kohli Out : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఫలితంగా శుక్రవారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేశారు. భారత్ జట్టు మరో 125 పరుగులు వెనకబడి ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (52), యశస్వి (35) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ (70) పరుగులు చేయగా.. సర్ఫరాజ్ 70 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అయితే, రోహిత్, యశస్వి వికెట్లు కోల్పోయిన తరువాత కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడారు. మరో వికెట్ కోల్పోకుండా పటిష్ట స్థితిలో భారత్ రోజును ముగించేలా కనిపించింది. కానీ, చివరి బాల్ కు కోహ్లీ ఔట్ అయ్యాడు.
శుక్రవారం ఆటలో చివరి బంతికి విరాట్ కోహ్లీ (70) ఔట్ అయ్యాడు. చివరి బంతికి ఫిలిప్స్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు కోహ్లీ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కోహ్లీ ఔట్ అవ్వగానే కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతకుముందు కోహ్లీ సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ పూర్తిచేయడం ద్వారా టెస్టుల్లో 9వేల పరుగుల మైలురాయిని కోహ్లీ అందుకున్నాడు. భారత్ క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 15,921 పరుగులు చేయగా.. రాహుల్ ద్రవిడ్ 13,265, సునీల్ గవాస్కర్ 10,122 పరుగులు చేశాడు. వారి తరువాత స్థానంలో 9వేల పరుగుల మార్కును చేరుకున్న నాల్గో ప్లేయర్ కోహ్లీనే కావటం గమనార్హం.
Reaction from Captain Rohit Sharma when Kohli got out. 💔 pic.twitter.com/FaIppOWxGh
— Johns. (@CricCrazyJohns) October 18, 2024