BBL : బీబీఎల్ ఆల్ టైమ్ రికార్డును సమం చేసిన తబ్రైజ్ షంసీ.. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి..
బిగ్‌బాష్ లీగ్‌లో (BBL) అడిలైడ్ స్ట్రైకర్స్ ఆటగాడు తబ్రైజ్ షంసీ అరుదైన ఘనత సాధించాడు.
Melbourne Stars vs Adelaide Strikers Tabraiz Shamsi equals all time BBL record
- అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్‌బోర్న్ స్టార్స్ ల మధ్య మ్యాచ్
- 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 22 బంతులు ఆడిన తబ్రైజ్ షంసీ
- బీబీఎల్ ఆల్‌టైమ్ రికార్డు సమం
BBL : బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆటగాడు తబ్రైజ్ షంసీ అరుదైన ఘనత సాధించాడు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 22 బంతులు ఎదుర్కొని 8 పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు. ఈ క్రమంలో బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 11వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి అత్యధిక బంతులు ఎదుర్కొన్న ముజీబ్ ఉర్ రెహమాన్ రికార్డును అతడు సమం చేశాడు. 2018లో అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌కు చెందిన ముజీబ్ బ్రిస్బేన్ హీట్ తరుపున ఆడుతూ 22 బంతులు ఎదుర్కొని 27 పరుగులు సాధించాడు.
ఇక ఓవరాల్‌గా చూసుకుంటే 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక బంతులు ఎదుర్కొన్న రికార్డు పనామాకు చెందిన నికుంజ్ హిర్ పేరిట ఉంది. 2021లో అర్జెంటీనాపై 38 బంతులు ఎదుర్కొని నికుంజ్ 20 పరుగులు చేశాడు.
Lauren Bell : డబ్ల్యూపీఎల్ కొత్తందం.. ఆర్‌సీబీ ప్లేయర్ లారెన్ బెల్ పిక్స్ చూస్తే మతి పోవడం ఖాయం..
బిగ్‌బాష్ లీగ్ 2025-2026లో భాగంగా మంగళవారం అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్‌బోర్న్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అడిలైడ్ తొలుత బ్యాటింగ్ చేసింది. మెల్‌బోర్న్ బౌలర్ల ధాటికి అడిలైడ్ 19.3 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది.
అడిలైడ్ బ్యాటర్లలో లియామ్ స్కాట్ (18), కామెరాన్ బోయ్స్ (20)లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. మెల్ బోర్న్ బౌలర్లలో టామ్ కర్రాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్వెప్సన్ మూడు వికెట్లు తీయగా మార్కస్ స్టోయినిస్ రెండు వికెట్లు పడగొట్టాడు. పీటర్ సిడిల్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం థామస్ ఫ్రేజర్ రోజర్స్ (32), మార్కస్ స్టోయినిస్ (23) లు రాణించడంతో 84 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మెల్‌బోర్న్ స్టార్స్ 15.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అడిలైడ్ బౌలర్లలో లియామ్ స్కాట్ రెండు వికెట్లు తీశాడు.
