Shreyas Iyer : రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో రెండో వ‌న్డే.. శ్రేయ‌స్ అయ్య‌ర్ చ‌రిత్ర సృష్టించేనా?

రాజ్‌కోట్ వ‌న్డేలో 34 ప‌రుగులు చేస్తే అత్యంత వేగంగా 3 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న భార‌త బ్యాట‌ర్‌గా శ్రేయ‌స్ (Shreyas Iyer) చ‌రిత్ర సృష్టిస్తాడు.

Shreyas Iyer : రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో రెండో వ‌న్డే.. శ్రేయ‌స్ అయ్య‌ర్ చ‌రిత్ర సృష్టించేనా?

Shreyas Iyer need 34 runs to become the quickest Indian batter to reach 3000 runs in terms of innings

Updated On : January 13, 2026 / 3:21 PM IST
  • రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్‌,న్యూజిలాండ్ ల మ‌ధ్య రెండో వ‌న్డే
  • వ‌న్డేల్లో 3 వేల ప‌రుగుల మైలురాపై శ్రేయ‌స్ క‌న్ను
  • 34 పరుగులు అవ‌స‌రం

Shreyas Iyer : న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భార‌త్ శుభారంభం చేసింది. వ‌డోద‌ర వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో వ‌న్డే మ్యాచ్ రాజ్ కోట్ వేదిక‌గా బుధ‌వారం (జన‌వ‌రి 14) జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

2017లో శ్రేయ‌స్ అయ్య‌ర్ అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 74 మ్యాచ్‌లు ఆడాడు. 68 ఇన్నింగ్స్‌ల్లో 47.8 స‌గ‌టుతో 2966 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 సెంచ‌రీలు, 23 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

Mohammad Nabi : క్రికెట్ చ‌రిత్ర‌లోనే అరుదైన ఘ‌ట‌న‌.. కొడుకుతో క‌లిసి ఆడ‌డంపై న‌బీ కామెంట్స్‌..

ఇక రాజ్‌కోట్ వ‌న్డేలో అత‌డు 34 ప‌రుగులు చేస్తే.. వ‌న్డేల్లో 3 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. అంతేకాదండోయ్‌.. టీమ్ఇండియా త‌రుపున అత్యంత వేగంగా ఈ ఘ‌న‌త సాధించిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు శిఖ‌ర్ ధావ‌న్ పేరిట ఉంది. ధావ‌న్ 72 ఇన్నింగ్స్‌ల్లో 3వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇక కోహ్లీ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..
* శిఖర్ ధావన్ – 72 ఇన్నింగ్స్‌లు
* విరాట్ కోహ్లీ – 75 ఇన్నింగ్స్‌లు
* కేఎల్ రాహుల్ – 78 ఇన్నింగ్స్‌లు
* నవజ్యోత్ సిద్ధూ – 79 ఇన్నింగ్స్‌లు
* సౌరవ్ గంగూలీ – 82 ఇన్నింగ్స్‌లు

Smriti Mandhana : కొద్దిలో ప్ర‌మాదం త‌ప్పింది.. ఒక‌వేళ అలా జ‌రిగి ఉంటేనా.. నా గ‌తి ఏమ‌య్యేదో.. స్మృతి మంధాన‌

ఇక వ‌న్డేల్లో అత్యంత వేగంగా మూడు వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 57 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. షై హోప్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్ లు 67 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త అందుకున్నారు. బాబ‌ర్ ఆజామ్ 68 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.