Mohammad Nabi : క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. తండ్రీకొడుకులు ఒకే మ్యాచ్ లో ఆడిన సీన్..
ఇక కొడుకుతో కలిసి ఆడడంపై నబీ (Mohammad Nabi) స్పందిస్తూ చాలా సంతోషంగా ఉందన్నాడు.
Nabi and Eisakhil become first father son duo to bat together in Bangladesh Premier League
- క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన
- ఒకే జట్టు తరుపున కలిసి ఆడిన మహ్మద్ నబీ, అతడి కొడుకు హసన్ ఐసాఖిల్
- బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో
Mohammad Nabi : క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. తండ్రీ కొడుకులు కలిసి ఒకే జట్టు తరుపున ఆడారు. ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025-26లో ఆవిష్కృతమైంది. వారు మరెవరో కాదు.. అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ(Mohammad Nabi), అతడి కొడుకు హసన్ ఐసాఖిల్. కాగా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తండ్రీ కొడుకులు కలిసి ఆడడం ఇదే తొలిసారి.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరిగాయి. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి ఓ తండ్రీ కొడుకు (సుహైల్ సత్తార్ (50) యాహ్యా సుహైల్ (17)) తిమోర్-లెస్టే అనే దేశం తరఫున కలిసి టీ20 మ్యాచ్ ఆడారు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు శివ్‌నరైన్ చంద్రపాల్, అతడి కొడుకు తేజ్‌నరైన్ చంద్రపాల్ లు ఇద్దరూ కలిసి ఓ క్లబ్ మ్యాచ్ ఆడారు.
Alyssa Healy : అలిస్సా హీలీ సంచలన నిర్ణయం.. భారత్‌తో సిరీసే చివరిది.. ఆ తరువాత ఇక..
🚨 FIRST TIME IN THE HISTORY OF CRICKET 🚨
– A father and son duo is playing together in a team at the Int’l level 👏🏻
– Mohammad Nabi (41) playing with his son Hassan Eisakhil (19) in BPL 2026 🔥
– What’s your take 🤔pic.twitter.com/sW4HpDH2rB
— Richard Kettleborough (@RichKettle07) January 12, 2026
ఇక తాజా ఘటన విషయానికి వస్తే నబీ వయసు 41 సంవత్సరాలు కాగా హసన్ వయసు 19. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో నబీ, హసన్ లు ఇద్దరూ నోఖాలి ఎక్స్‌ప్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత కొన్నాళ్లుగా బెంచీ పైనే కూర్చున్న హసన్ ఢాకా క్యాపిటల్స్ మ్యాచ్ ద్వారా బీపీఎల్ లో అరంగ్రేటం చేశాడు.
అరంగేట్రంలోనే విధ్వంసం..
హసన్ తన తొలి మ్యాచ్‌లో దుమ్ములేపాడు. 60 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 92 పరుగులు సాధించి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఇక అతడు తన తండ్రి నబీ(17)తో కలిసి నాలుగో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.
ఇక బ్యాటింగ్‌లో విఫలమైన నబీ బౌలింగ్‌లో సత్తా చాటాడు. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తండ్రీ కొడుకు లు రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై నోఖాలి ఎక్స్‌ప్రెస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇక కొడుకుతో కలిసి ఆడడంపై నబీ స్పందిస్తూ.. చాలా సంతోషంగా ఉందన్నాడు. కొడుకుతో కలిసి ఆడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అరంగ్రేటంలోనే అతడు రాణించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన కుమారుడి కల అని నబీ చెప్పుకొచ్చాడు.
