SA 20 : సూపర్ కింగ్స్‌కు భారీ షాక్‌.. కెప్టెన్‌కు తీవ్ర‌గాయం.. టోర్నీ నుంచి ఔట్‌..

సౌతాఫ్రికా టీ20 (SA 20 ) లీగ్ నాలుగో సీజన్‌లో జోబర్గ్‌ సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది.

SA 20 : సూపర్ కింగ్స్‌కు భారీ షాక్‌.. కెప్టెన్‌కు తీవ్ర‌గాయం.. టోర్నీ నుంచి ఔట్‌..

SA20 Faf du Plessis ruled out remaining season

Updated On : January 13, 2026 / 5:31 PM IST
  • జోబర్గ్‌ సూపర్ కింగ్స్‌కు భారీ షాక్
  • కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు గాయం
  • టోర్నీ నుంచి ఔట్

SA 20 : సౌతాఫ్రికా టీ20 లీగ్ నాలుగో సీజన్‌లో జోబర్గ్‌ సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కార‌ణంగా మిగిలిన సీజ‌న్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని జోబ‌ర్గ్ టీమ్ త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో డోనోవన్ ఫెరీరా ను సార‌థిగా వ్య‌వ‌హరిస్తాడ‌ని పేర్కొంది.

లీగ్‌లో భాగంగా జ‌నవరి 10న జోబర్గ్‌ సూపర్ కింగ్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా ఫాఫ్ డుప్లెసిస్ కుడి చేతి బొట‌న‌వేలికి తీవ్ర‌గాయ‌మైంది. దీంతో వెంట‌నే అత‌డు మైదానాన్ని వీడాడు. ఆ త‌రువాత బ్యాటింగ్‌కు కూడా రాలేదు. అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి స్కానింగ్ నిర్వ‌హించ‌గా అత‌డి బొట‌న వేలి లిగ్‌మెంట్ తెగిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. శ‌స్త్ర‌చికిత్స అవ‌స‌రం అని సూచించారు. దీంతో అత‌డు టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు.

BBL : బీబీఎల్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన తబ్రైజ్ షంసీ.. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి..

41 ఏళ్ల డుప్లెసిస్ ఈ సీజ‌న్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 27 స‌గ‌టు, 151.69 స్ట్రైక్‌రేటుతో 135 ప‌రుగులు చేశాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సూప‌ర్ కింగ్స్ ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో నిలిచింది. సీజ‌న్ చివ‌రిలో కెప్టెన్ డుప్లెసిస్ దూరం కావ‌డం జోబర్గ్‌ సూపర్ కింగ్స్ కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.