Harmanpreet Kaur : డబ్ల్యూపీఎల్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సరికొత్త రికార్డు నమోదు.. భారత తొలి బ్యాటర్..

Harmanpreet Kaur : డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్‌లో వెయ్యి పరుగులు దాటిన తొలి భారతీయ క్రికెటర్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది. మరోవైపు.. డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక సార్లు 50కిపైగా స్కోర్లు సాధించిన క్రికెటర్‌గానూ నిలిచింది.

Harmanpreet Kaur : డబ్ల్యూపీఎల్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సరికొత్త రికార్డు నమోదు.. భారత తొలి బ్యాటర్..

Harmanpreet Kaur

Updated On : January 14, 2026 / 10:52 AM IST
  • డబ్ల్యూపీఎల్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అరుదైన ఘనత
  • లీగ్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌
  • డబ్ల్యూపీఎల్ లో ఎక్కువసార్లు 50కిపైగా పరుగులు

Harmanpreet Kaur : డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ సత్తా చాటింది. మంగళవారం రాత్రి ముంబయి ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (71 నాటౌట్ 43 బంతుల్లో) అద్భుత బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ జెయింట్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Also Read : WPL : దంచికొట్టిన హారిస్, స్మృతి మంధాన.. ఆర్సీబీ సూపర్ విక్టరీ..

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. భారీ ఛేదనలో ముంబయికి గొప్ప ఆరంభమేమీ లభించలేదు. ఓపెనర్లు కమలిని (13), హేలీ మాథ్యూస్ (22) వెంటవెంటనే ఔట్ అయ్యారు. అయితే, అమన్ జ్యోత్ కౌర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అదిరే భాగస్వామ్యంతో ఇన్నింగ్సును చక్కదిద్దారు. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ 43 బంతుల్లో 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆమె 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తద్వారా డబ్ల్యూపీఎల్ లో తన 10వ హాఫ్ సెంచరీని నమోదు చేసింది. ఈ క్రమంలోనే హర్మన్ ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డును నమోదు చేసింది.


డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్‌లో వెయ్యి పరుగులు దాటిన తొలి భారతీయ క్రికెటర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది. మరోవైపు.. డబ్ల్యూపీఎల్ లో అత్యధిక సార్లు 50కిపైగా స్కోర్లు సాధించిన క్రికెటర్ గానూ హర్మన్ ప్రీత్ ఘనత సాధించింది.

WPL లో అత్యధికసార్లు 50కిపైగా స్కోర్ సాధించినవారు..
హర్మన్‌ప్రీత్ కౌర్ – 10
నాట్ స్కైవర్ -బ్రంట్ – 9
మెగ్ లానింగ్ – 9
ఎల్లీస్ పెర్రీ – 8