IPL Cricket Betting : పాకిస్తాన్ టు హైదరాబాద్.. 2019 ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌పై సీబీఐ దర్యాప్తు ముమ్మరం

పాకిస్తాన్ నుండి ఆదేశాలతో బెట్టింగ్ నిర్వహించినట్టు గుర్తించింది. పాకిస్తాన్ టూ హైదరాబాద్ బెట్టింగ్ లింకులపై ఆరా తీస్తున్నారు.

IPL Cricket Betting : 2019 ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పై సీబీఐ దర్యాఫ్తు ముమ్మరం చేసింది. పాకిస్తాన్ నుండి ఆదేశాలతో బెట్టింగ్ నిర్వహించినట్టు గుర్తించింది. పాకిస్తాన్ టూ హైదరాబాద్ బెట్టింగ్ లింకులపై ఆరా సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు పొందుపరిచారు. ఈ నెట్‌వర్క్ ద్వారా 2013 నుంచి బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

గోవాలో భర్త, తెలంగాణలో భార్య.. దంపతుల ఖతర్నాక్‌ దందా, ఇలా ఓ మహిళ పట్టుబడటం ఇదే ఫస్ట్ టైమ్

Betting

ఎఫ్ఐఆర్‌లో దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసులను నిందితులుగా పేర్కొంది సీబీఐ. నిందితుల బ్యాంకు ఖాతా ద్వారా ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు సీబీఐ వెల్లడించింది. రెండో ఎఫ్ఐఆర్‌లో సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్, కొందరు ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులను నిందితులుగా పేర్కొంది సీబీఐ.

మరో ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్, అప్పులు తీర్చలేక నిజామాబాద్ యువకుడు ఆత్మహత్య

Betting (1)

2010 నుంచి ఈ నెట్ వర్క్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. వీరు జరిపిన లావాదేవీల విలువ కోట్లలో ఉంటుందని వెల్లడించారు. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలో 2013 నుంచి దాదాపు 43 లక్షలకు పైగా నిధులు ఉన్నట్లు సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఈ నెట్‌వర్క్‌లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్ కు చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు ఉన్నట్లుగా సీబీఐ దగ్గర కచ్చితమైన సమాచారం ఉంది.

నెల్లూరులో రెచ్చిపోయిన బెట్టింగ్ మాఫియా

Ipl Betting

ట్రెండింగ్ వార్తలు