మరో ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్, అప్పులు తీర్చలేక నిజామాబాద్ యువకుడు ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : November 19, 2020 / 04:45 PM IST
మరో ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్, అప్పులు తీర్చలేక నిజామాబాద్ యువకుడు ఆత్మహత్య

ipl betting debts suicide: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్ కోసం అప్పులు చేసిన చరణ్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగ్ లు వద్దని వేడుకున్నా చరణ్ వినలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బెట్టింగ్ కోసం చరణ్ రూ.2.50లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

అత్యాశకు పోయి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు:
చాలా మంది యువకులు క్రికెట్ బెట్టింగ్‌లు కాస్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అత్యాశపోయి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ ముఠాల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకులతో బెట్టింగ్‌లు కాయించడం.. ఆ డబ్బు కోసం వారిని వేధించడం.. అప్పుల పాలైన యువకులు వాటిని తీర్చే దారి లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తమ బాధను ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక, ఊబి నుంచి బయటపడే దారి లేక ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఐపీఎల్ బెట్టింగ్‌లో నష్టం.. పురుగుల మందు తాగిన యువకులు:
ఇలాంటి ఘటనే ఒకటి ఇటీవలే గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో దిగి భారీగా నష్టపోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం త్యాళ్లూరు గ్రామానికి చెందిన సురేష్ (22), కొమరయ్య(21) బెల్లంకొండలోని రైల్వే ట్రాక్ వద్ద అపాస్మరకస్థితిలో పడి ఉన్నారు. వారు పురుగుల మందు సేవించినట్లుగా గుర్తించిన గ్రామస్థులు వారిని ఆస్పత్రి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.
https://10tv.in/five-dead-four-critically-injured-in-an-explosion-inside-a-factory-in-west-bengal/
బెట్టింగ్ లో లక్షల నష్టం:
తాము క్రికెట్ బెట్టింగ్ లో లక్షల రూపాయలు నష్టపోయామని.. డబ్బులు చెల్లించాలని బెట్టింగ్ నిర్వాహకుడు ఒత్తిడి తేవడంతో చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగుతున్నామంటూ ఓ వీడియోను బంధువులకు వాట్సాప్ లో పంపించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు ఇద్దరిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా.. తర్వాత మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్ చనిపోగా.. కొమరయ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.