IND vs PAK : శ్రేయస్ అయ్యర్ జట్టు పాకిస్తాన్‌ను బహిష్కరించింది.. ఫ్యాన్స్ ఫిదా!
ఆసియాకప్ 2024లో భాగంగా భారత్, పాక్ (IND vs PAK ) జట్ల మధ్య దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14 (ఆదివారం) మ్యాచ్ జరగనుంది.

Shreyas Iyer IPL Team Boycotts Pakistan Ahead Of IND Vs PAK Clash
IND vs PAK : ఆసియాకప్ 2025లో భాగంగా భారత్, పాక్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాదు యావత్ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇటీవల ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని కొందరు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్ ఆసియా కప్‌లో పాకిస్తాన్ ను బహిష్కరించడానికి ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొంది.
పంజాబ్ కింగ్స్ తన సోషల్ మీడియాలో ఆసియాకప్ 2025లో టీమ్ఇండియా ఆడబోయే రెండో మ్యాచ్ (IND vs PAK) గురించి ప్రస్తావించింది. అయితే.. అక్కడ పాక్ పేరును ప్రస్తావించలేదు. ఆ ప్రదేశంలో ఖాళీగా ఉంచారు. పంజాబ్ చేసిన ఈ పోస్టు చాలా మందిని ఆకర్షించింది.
Game 2️⃣ for the defending champions. Let’s goooo 💪#AsiaCup2025 #INDv pic.twitter.com/BgeoRfJjMo
— Punjab Kings (@PunjabKingsIPL) September 11, 2025
అమ్ముడుపోనీ టికెట్లు..
భారత్, పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టోర్నీ ఏదైన కానీ ఈ మ్యాచ్ టికెట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే హాట్ కేకేల్లా అమ్ముడుపోతుంటాయి. అయితే.. సెప్టెంబర్ 14న మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమై 10 రోజులు అయినా కూడా చాలా టికెట్లు అమ్ముడుపోనట్లుగా తెలుస్తోంది.
కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ2025లో భాగంగా ఇదే స్టేడియంలో భారత్, పాక్ మ్యాచ్ జరుగగా నాటి మ్యాచ్ టికెట్లు కేవలం నాలుగు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే అమ్ముడుపోవడం విశేషం.
Bronco Test : బ్రాంకో టెస్టును పూర్తి చేసిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ
గురువారం రాత్రి నాటికి దుబాయ్ స్టేడియం సామర్థ్యంలో దాదాపు సగం స్టాండ్ల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ ధరలు 99 డాలర్ల నుంచి ప్రారంభం కాగా.. ప్రీమియం టికెట్ల ధర 4,534 డాలర్లు (సుమారు 4లక్షలు)గా ఉంది.