Ishanth Kishan
Ishan Kishan: భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ రెండు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించి 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో వన్డే జనవరి 15న జరుగుతుంది. పూర్తయిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఎడమచేతి బ్యాటర్ ఇషాన్ కిషన్ కు అవకాశం దక్కలేదు. దీంతో టీమిండియాలోని పలువురు మాజీ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. రెండు మ్యాచ్‌లలో అవకాశం దక్కించుకోలేక పోయిన ఇషాన్ కిషన్ మూడో వన్డేలో తుదిజట్టులో చోటుదక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
India vs sri lanka 2nd ODI: రెండో వన్డేలోనూ భారత్‌దే విజయం.. సిరీస్ కైవసం.. ఫొటో గ్యాలరీ
శ్రీలంకతో సిరీస్ కంటే ముందు బంగ్లాదేశ్‌లో జరిగిన వన్డేలో ఇషాన్ కిషన్ అధ్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వన్డేలో డబుల్ సెంచరీ చేశాడు. 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ శ్రీలంకతో జరిగిన రెండు వన్డే మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ ను తీసుకోకపోవటంపై పలువురు మాజీ క్రికెటర్లతో పాటు, ఇషాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతున్నారు. శ్రీలంకతో రెండో వన్డే పూర్తయిన తరువాత.. కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. అయితే, టాప్ ఆర్డర్ లో ఎడమచేతి వాటం బ్యాటర్ లేకపోవటం మీకు ఇబ్బందిగా లేదా అన్న ప్రశ్నకు రోహిత్ బదులిచ్చాడు.
India vs Srilanka 2nd ODI: జోరు కొనసాగేనా..? నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో వన్డే
టాప్ ఆర్డర్ లో ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం మంచి విషయమే. టీమిండియాలో ఎడమచేతి బ్యాటర్లు (ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్) గత ఏడాది కాలంలో చాలా పరుగులు చేశారు. ఈ క్రమంలో మేంకూడా ఎడమచేతి బ్యాటర్ ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కుడి చేతి బ్యాటర్ల సామర్థ్యంకూడా మనకు తెలుసు. ప్రస్తుతానికి ఓపెనింగ్ కాంబినేషన్ బాగానే ఉంది. మూడో వన్డేలో పిచ్ ను బట్టి ఎడమచేతి బ్యాటర్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపాడు. దీనికితోడు టీమిండియా సిరీస్ గెలుచుకోవటంతో.. మూడో వన్డేలో ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈనేపథ్యంలో కేఎల్ రాహుల్ స్థానంలో మూడో వన్డేలో ఇషాన్ కిషన్ కు అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయని ఇషాన్ అభిమానులు ఆశతో ఉన్నారు.