×
Ad

CSK : ఎందుకు తొంద‌ర‌.. మేము చెబుతాముగా.. సోష‌ల్ మీడియాలో సీఎస్‌కే పోస్ట్..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు మినీ వేలం (IPL Auction) జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ఆట‌గాళ్ల‌ను ఈ వేలం కోసం సీఎస్కే (CSK)విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది

Chennai Super Kings Break Silence On Reports Of Releasing Players

CSK : ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘోరంగా విఫ‌ల‌మైంది. 14 మ్యాచ్‌లు ఆడ‌గా కేవ‌లం నాలుగు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ క్ర‌మంలో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంతో సీజ‌న్‌ను ముగించింది. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ 2026లో రాణించేందుకు ఇప్ప‌టికే సీఎస్‌కే (CSK) త‌మ జ‌ట్టులో మార్పులు చేర్పులు మొద‌లుపెట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు మినీ వేలం (IPL Auction) జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ఆట‌గాళ్ల‌ను ఈ వేలం కోసం సీఎస్కే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. క్రిక్‌బ‌జ్ నివేదిక ప్ర‌కారం.. సామ్ కరన్, దీపక్ హుడా, విజయ్‌ శంకర్, రాహుల్ త్రిపాఠి, డేవాన్ కాన్వేను వదివివేస్తున్న‌ట్లు స‌మాచారం. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

Yashasvi Jaiswal : రెండో ఓవ‌ర్‌లోనే భార‌త్‌కు భారీ షాక్‌.. లేని ప‌రుగు కోసం య‌త్నించి జైస్వాల్ ర‌నౌట్‌..


ముఖ్యంగా దూకుడుగా ఆడే కాన్వే, ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌ణ్‌ను వ‌దిలివేయ‌వ‌ద్దు అంటూ సీఎస్‌కే ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వార్త‌ల‌పై సీఎస్‌కే సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. ఎవ‌రూ కంగారు ప‌డొద్దు.. మేమే అప్‌డేట్ చేస్తాం అని సీఎస్‌కే పోస్ట్ చేసింది.

IND vs WI 2nd Test : టీ బ్రేక్ స‌మ‌యంలో జైస్వాల్‌కు ఒక‌టే చెప్పాను.. బ్యాటింగ్ సితాన్షు కోట‌క్‌

ఈ ఐదుగురిని వ‌దిలివేయ‌డం ద్వారా సీఎస్‌కేకు పెద్ద మొత్త‌మే మిగ‌ల‌నుంది. ఇప్ప‌టికే ర‌విచంద్ర‌న్ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డంతో సీఎస్‌కేకు రూ.9.75 కోట్లు ప‌ర్స్ వాల్యూ ల‌భించింది.