నువ్వు తోపు బాసూ : 2020 వరకు రవిశాస్త్రినే

పదవీ కాలం పూర్తవగానే రాజీనామా చేసి తప్పుకోవాల్సిందే. కానీ, వాళ్లకున్న క్రేజ్… నైపుణ్యాలను బట్టి మరింత పొడిగించినా ఆశ్చర్యపడాల్సిన అవసర్లేదు. కానీ, విదేశీ పర్యటనల్లో ఓడిన ప్రతిసారి విమర్శలను ఎదుర్కొన్న రవిశాస్త్రి పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లుగా బీసీసీఐ నిర్ణయం తీసుకోనుందట. 
Read Also : అదే డబ్బును ఇలా: బీసీసీఐ రూ.20 కోట్లు ఇవ్వనుంది

బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీతో అయిన సమావేశంలో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంపై చర్చించిందట. మే 30 నుంచి ఆరంభం కానున్న ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకునే కోచ్ రవిశాస్త్రి, అతని సిబ్బంది పదవీ కాలాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారట. 

పలు విమర్శలు, వివాదాల అనంతరం 2017లో పదవీ కాలం పూర్తయిన తర్వాత కుంబ్లే టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి కోచ్ పదవిలో కొనసాగుతున్న రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ల పదవీ కాలం ఈ ఏడాది జులైతో ముగియనుంది. 

జోహ్రితో సమావేశమైన సీఓఏ మాట్లాడుతూ.. ‘కొన్ని నెలలుగా విదేశాల్లో టీమిండియా చేస్తున్న ప్రదర్శన బాగుంది. ఫార్మాట్ లకు అనుగుణంగా సమయోచితమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సొంతగడ్డపై విండీస్ ను చిత్తుచేసి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లోనూ విజయవంతంగా తిరిగొచ్చింది టీమిండియా. కోచ్ బృందాన్ని నవంబరు 2020 వరకూ కొనసాగించాలనుకుంటున్నాం’ అని వెల్లడించారు. 
Read Also : ధోనీ లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయింది: పాంటింగ్

ట్రెండింగ్ వార్తలు