Commonwealth Games 2026 : కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌కు ఊహించ‌ని షాక్‌..

కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

Commonwealth Games 2026 drops wrestling cricket hockey and other major sports

Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ్లాస్గో వేదిక‌గా జ‌ర‌గ‌నున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 నుంచి హాకీ, క్రికెట్, రెజ్లింగ్‌, బ్యాడ్మింట‌న్‌, టేబుల్ టెన్నిస్‌, స్క్వాష్‌, షూటింగ్, నెట్‌ బాల్, రోడ్‌ రేసింగ్‌ను తొల‌గిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

బ‌ర్మింగ్‌హామ్ వేదిక‌గా 2022లో జ‌రిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 19 క్రీడాంశాలు నిర్వ‌హించారు. అయితే.. ప్ర‌స్తుతం ఖ‌ర్చు త‌గ్గించుకోవాల‌నే ఉద్దేశ్యం కేవ‌లం 10 క్రీడాంశాల్లోనే కామ‌న్వెల్త్ పోటీల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

Sunil Gavaskar : అలాంటి స‌న్న‌టి న‌డుము లేద‌ని ఎంపిక చేయ‌లేదు.. బీసీసీఐ పై గ‌వాస్క‌ర్ సెటైర్లు..

కామన్వెల్త్ గేమ్స్‌ను ప్ర‌తి నాలుగేళ్లకు ఒక‌సారి నిర్వ‌హిస్తారు అన్న సంగ‌తి తెలిసిందే. 2026 జూలై 23 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు ఈ టోర్న‌మెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ సారి స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదిక‌గా కామ‌న్వెల్త్ గేమ్స్ జ‌ర‌గ‌నున్నాయి.

భార‌త్‌కు ఇబ్బందే..

ఈ నిర్ణ‌యం ఒక ఓ ర‌కంగా భార‌త్ ఇబ్బంది క‌ర‌మే. హాకీ, బ్యాడ్మింట‌న్‌, రెజ్లింగ్‌, క్రికెట్ షూటింగ్‌లో ప‌త‌కాలు వ‌చ్చే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది. ఇప్పుడు వీటిని తొల‌గించ‌డంతో భార‌త్‌కు వ‌చ్చే ప‌త‌కాల సంఖ్య భారీగా త‌గ్గే అవ‌కాశం ఉంది. 2022 కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్ 61 ప‌త‌కాలు సాధించింది.

నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణ‌, 16 ర‌జిత‌, 23 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. అప్పుడు రెజ్లింగ్‌లో 12, వెయిట్ లిఫ్టింగ్‌లో 10 ప‌త‌కాలు వ‌చ్చాయి.

Prithvi Shaw : పృథ్వీ షాకి షాక్‌.. జ‌ట్టు నుంచి త‌ప్పించిన ముంబై.. క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు!