Sunil Gavaskar : అలాంటి సన్నటి నడుము లేదని ఎంపిక చేయలేదు.. బీసీసీఐ పై గవాస్కర్ సెటైర్లు..
రంజీల్లో పరుగుల వరద పారించినా చాలా కాలం పాటు సెలక్టర్లు అతడిని కరుణించలేదు.

Sunil Gavaskar Questions YoYo Test Backs Sarfaraz Khan Fitness and Skills
రంజీల్లో పరుగుల వరద పారించినా చాలా కాలం పాటు సెలక్టర్లు అతడిని కరుణించలేదు. ఎట్టకేలకు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అతడు వచ్చిన అవకాశాలను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులతో రాణించాడు. అతడు మరెవరో కాదు సర్ఫరాజ్ ఖాన్. బెంగళూరు టెస్టులో సర్ఫరాజ్ ఆడిన ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ క్రమంలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సైతం సర్ఫరాజ్ ఖాన్‌ను ప్రశంసించాడు. అదే సమయంలో బీసీసీఐ పై సెటైర్లు వేశాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించినప్పటికి సర్ఫరాజ్ ఖాన్‌కు కొన్నేళ్ల పాటు టీమ్ఇండియాలో చోటు దక్కలేదు.
Prithvi Shaw : పృథ్వీ షాకి షాక్.. జట్టు నుంచి తప్పించిన ముంబై.. క్రమశిక్షణా చర్యలు!
ఎందుకంటే అతడికి సన్నటి నడుము లేదని నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నవారు భావించడమేనని గవాస్కర్ అన్నాడు. మైదానంలో అతడు రాబడుతున్న ఫలితాలు అతడి నడుము చుట్టుకొలత కన్నా మిన్నగా ఉన్నాయన్నాడు.
ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే వాళ్లు కోరుకునే సన్నటి నడుము రిషబ్ పంత్‌కు లేదు. అయినా అతడు మ్యాచ్ స్వరూపాన్ని ఒకే ఓవర్‌లో మార్చి వేయగలడు అని గవాస్కర్ చెప్పాడు. అందుకనే ఈ యోయో పరీక్షలను పక్కన బెట్టాలని సూచించాడు. అందుకు బదులుగా ఓ ఆటగాడు మానసికంగా ఎంత బలంగా ఉన్నాడో అంచనా వేయాలని తెలిపాడు. ఓ ఆటగాడి ఫిట్‌నెస్‌కు నిజమైన సూచిక అదేనని గవాస్కర్ తెలిపాడు. ప్రస్తుతం బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఓ ఆటగాడు యోయో టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే 16.5 స్కోరు సాధించాల్సి ఉంది.
India A vs UAE : అభిషేక్ శర్మ విధ్వంసం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్..