ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం అత్యంత కనిష్టంగా 3.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. గత12 ఏళ్లలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవటం ఇదే మొదటి సారి. దీనికితోడు పొగమంచు కూడా కమ్ముకోవటంతో వాహానదారులు రాకపోకలకు పలు ఇబ్బందులు పడ్డారు. 2007 డిసెంబర్ 29 న అత్యల్పంగా 3.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.