Alex Hales : ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 14 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అలెక్స్ హేల్స్ (Alex Hales) గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించాడు.
ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో 14 వేల పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అంతేకాదండోయ్ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో కీరన్ పొలార్డ్‌ను అధిగమించాడు.
ఇక టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు క్రిస్‌గేల్ పేరిట ఉంది. గేల్ 463 మ్యాచ్‌ల్లో 14,562 పరుగులు సాధించాడు. అలెక్స్ హేల్స్ 509 మ్యాచ్‌ల్లో 14,024 పరుగులు చేశాడు. కీరన్ పొలార్డ్ 713 మ్యాచ్‌ల్లో 14,012 పరుగులు సాధించాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 463 మ్యాచ్‌ల్లో 14,562 పరుగులు
అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్) – 509 మ్యాచ్‌ల్లో 14, 024 పరుగులు
కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్) – 713 మ్యాచ్‌ల్లో 14,012 పరుగులు
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 424 మ్యాచ్‌ల్లో 13,595 పరుగులు
షోయబ్ మాలిక్ (పాకిస్తాన్) – 557 మ్యాచ్‌ల్లో 13,571 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గయానా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గయానా బ్యాటర్లలో షైహోప్ (39), డ్వైన్ ప్రిటోరియస్ (21), క్వెంటిన్ సాంప్సన్ (25) లు రాణించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో అకేల్ హోసిన్ మూడు వికెట్లు తీశాడు.
ఆతరువాత 164 పరుగుల లక్ష్యాన్ని నైట్‌రైడర్స్ జట్టు 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నైట్ రైడర్స్ బ్యాటర్లలో అలెక్స్ హేల్స్ (74; 43 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోలిన్ మున్రో (52; 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించారు. గయానా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.