KCL 2025 : వీడెవండీ బాబు.. 12 బంతుల్లో 11 సిక్సర్లు.. ఒకే ఓవర్‌లో 40 పరుగులు.. రికార్డులకే దడ పుట్టించాడుగా
కేరళ క్రికెట్ లీగ్ 2025(KCL 2025)లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. 28 ఏళ్ల సల్మాన్ నిజార్ చివరి రెండు ఓవర్లలో 11 సిక్సర్లు బాది..

KCL 2025 Salman Nizar smashes 40 runs in one over
కేరళ క్రికెట్ లీగ్ 2025లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. 28 ఏళ్ల సల్మాన్ నిజార్ చివరి రెండు ఓవర్లలో 11 సిక్సర్లు బాది రికార్డు పుస్తకాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
కేరళ క్రికెట్ లీగ్ 2025లో భాగంగా శనివారం త్రివేండ్రం రాయల్స్, కాలికట్ గ్లోబ్‌స్టార్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాలికట్ గ్లోబ్‌స్టార్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 18 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులతో నిలిచింది. అప్పటికే నిజార్ క్రీజులో ఉన్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డ అతడు చివరి రెండు ఓవర్లలో జూలు విధిల్చాడు. బాసిల్ థంపి వేసిన 19 ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఆఖరి బంతికి సింగిల్ తీసి మరుసటి ఓవర్‌కు స్ట్రైకింగ్ లో ఉండేలా చూసుకున్నాడు. ఈ ఓవర్‌లో మొత్తంగా 31 పరుగులు వచ్చాడు.
ఇక చివరి ఓవర్‌ను అభిజిత్ ప్రవీణ్ వేశాడు. మొదటి బంతికి సల్మాన్ నిజార్ సిక్స్ బాదగా, తర్వాతి బంతి వైడ్ అయింది. తరువాత బంతి నోబాల్ కాగా రెండు పరుగులు వచ్చాయి. ఆ తరువాత ఐదు బంతులకు మళ్లీ ఐదు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌లో సల్మాన్ ఆరు సిక్సర్లు కొట్టగా.. మొత్తంగా ఈ ఓవర్‌లో 40 పరుగులు వచ్చాయి.
The final over was pure annihilation! Salman rewrote the final over with six brutal signatures. 🖋️💣#KCLSeason2 #KCL2025 pic.twitter.com/gVYjHxhp3H
— Kerala Cricket League (@KCL_t20) August 30, 2025
కాలికట్ జట్టు చివరి 12 బంతుల్లో 71 పరుగులు చేసింది. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో ఆఖరి రెండు ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఇక కాలికట్ గ్లోబ్‌స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సల్మాన్ నిజార్ (86 నాటౌట్ ; 26 బంతుల్లో 12 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మారుతుంగల్ అజినాస్(50 బంతుల్లో 51 పరుగులు)హాఫ్ సెంచరీ సాధించాడు.
Telugu Titans : తెలుగు టైటాన్స్‌కు ఏమైంది..? సొంత గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి..
అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన త్రివేండ్రం రాయల్స్ జట్టు 19.3 ఓవర్లలో 173 పరుగులకే పరిమితమైంది. దీంతో కాలికట్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.