CPL 2025 Trinbago Knight Riders enter into Qualifier 2
CPL 2025 : కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 (CPL 2025)లో వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. తాజాగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. కేవలం 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 90 పరుగులతో అజేయంగా నిలిచాడు.
పూరన్ విధ్వంసానికి అలెక్స్ హేల్స్ (54 నాటౌట్; 40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడు కావడంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యాన్ని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 17.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి అందుకుంది. ఈ విజయంతో నైట్‌రైడర్స్ క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. క్వాలిఫయర్ 2లో ఆ జట్టు క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టుతో తలపడనుంది.
PAK vs UAE : యూఏఈకీ గోల్డెన్ ఛాన్స్.. పాక్‌కు చావోరేవో.. మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటంటే?
Nicholas Pooran smashed 90* (53) with 3 fours and 8 sixes in the Eliminator of CPL 2025. 🔥pic.twitter.com/jTKBN6Zkyq
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2025
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆంటిగ్వా బ్యాటర్లలో ఆండ్రీస్ గౌస్ (61; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అమీర్ జాంగూ (55; 49 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ మూడు వికెట్లు పడగొట్టాడు. స్మాన్ తారిఖ్, ఆండ్రీ రసెల్ లు చెరో రెండు వికెట్లు సాధించారు.