CPL 2025 twentytwo runs scored off one ball in Caribbean League
CPL 2025 : కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025(CPL 2025)లో విండీస్ విధ్వంసకర వీరుడు రొమారియో షెఫర్డ్ అదరగొడుతున్నాడు. గయానా అమెజాన్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షెఫర్డ్.. సెయింట్ లూసియా కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క బంతికే 22 పరుగులు రావడం గమనార్హం.
22 పరుగులు ఎలా వచ్చాయంటే..?
సెయింట్ లూయిస్ బౌలర్ ఒషేన్ థామస్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతికి షెఫర్డ్ షాట్ ఆడగా పరుగులు ఏమీ రాలేదు. అయితే.. అది నోబాల్. ఆ తరువాత బంతి వైడ్‌గా వేశాడు. మరొసారి బాల్ వేయగా షెఫర్డ్ సిక్స్‌గా మలిచాడు. ఇక్కడ థామస్ దురదృష్టం ఏంటి అంటే అది నో బాల్. మళ్లీ బాల్ వేయగా ఈ సారి కూడా షెఫర్డ్ సిక్స్ బాదాడు. ఇది కూడా నోబాల్ కావడం గమనార్హం. ఆ తరువాత బాల్ వేయగా మళ్లీ సిక్స్ కొట్టాడు షెఫర్డ్. ఇలా ఓ లీగల్ బాల్ కోసం థామస్ ఐదు సార్లు బౌలింగ్ చేయగా మొత్తంగా 22 పరుగులు (N Wd N6 N6 6 ) వచ్చాయి. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని ఇఫ్తికార్ అహ్మద్ సిక్స్ బాదాడు. దీంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 33 పరుగులు సమర్పించుకున్నాడు థామస్.
R Ashwin : ఐపీఎల్ ద్వారా అశ్విన్ ఎంత సంపాదించాడో తెలుసా..? రూ.12లక్షల నుంచి మొదలై..
Shepherd showing no mercy at the crease! 🔥
Five huge sixes to start the charge! 💪#CPL25 #CricketPlayedLouder
#BiggestPartyInSport #SLKvGAW #iflycaribbean pic.twitter.com/6cEZfHdotd— CPL T20 (@CPL) August 27, 2025
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రొమారియో షెఫర్డ్ (73 నాటౌట్; 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. గయానా బ్యాటర్లలో షెఫర్డ్ కాకుండా ఇఫ్తికార్ అహ్మద్ (27 బంతుల్లో 33 పరుగలు), బెన్ మెక్‌డెర్మాట్ (18 బంతుల్లో 30 పరుగులు) రాణించారు. సెయింట్ లూసియా కింగ్స్ బౌలర్లలో గాస్టన్ రెండు వికెట్లు పడగొట్టాడు. పియెర్రీ, డేవిడ్ వీస్, ఒషేన్ థామస్ తలా ఓ వికెట్ తీశారు.
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్‌లో మరో 4 సిక్సర్లు బాదితే..
అనంతరం 203 పరుగుల లక్ష్యాన్ని సెయింట్ లూసియా కింగ్స్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే అంటే 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. సెయింట్ లూసియా బ్యాటర్లలో అఖీమ్ అగస్టీ ( 73; 35 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. టిమ్ సీఫర్ట్ (24 బంతుల్లో 37 పరుగులు), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 25 పరుగులు) రాణించారు. గయానా బౌలర్లలో గుడకేశ్ మోటీ, జెడియా బ్లేడ్స్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.