హాట్ ఫోజుల్లో పంత్‌ లవర్‌తో పాటు క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్

ప్రస్తుత జనరేషన్‌లో క్రికెటర్లు ఫోకస్ అయినంతగానే వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఫోకస్ అవుతున్నారు. ఎంతలా అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో క్రికెటర్ పేరు కొట్టగానే దాని కింద క్రికెటర్ భార్య గురించా.. గర్ల్ ఫ్రెండ్ గురించా.. అని ముందే కనిపిస్తోంది. ఇదిలా ఉంచితే క్రికెటర్లు కూడా సెలబ్రిటీలనో.. వారి చిన్ననాటి స్నేహితులనో ప్రేమించి వారి వ్యక్తిగత జీవితాల గురించి అందరికీ తెలియాలని ఆరాటపడుతుంటారు. 

కొంతమంది కొద్దిపాటి కాలం డేటింగ్ చేసిన తర్వాత విషయాన్ని బయటపెడితే మరికొంతమంది ప్రేమలో పడగానే సోషల్ మీడియాకెక్కెస్తారు. టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. ఇలాగే ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చి తన గర్ల్ ఫ్రెండ్‌తో దిగిన ఫొటోను షేర్ చేసేశాడు. అంతర్జాతీయ జట్టులోకి వచ్చీ రాగానే అద్భుతమైన రికార్డులతో దూసుకెళ్తూ మన్ననలు పొందుతున్న రిషబ్ పంత్ ఫొటో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. 

బెన్ కట్టింగ్ గర్ల్ ఫ్రెండ్ ఎరిన్ హోలాండ్.. ఆస్ట్రేలియా మాజీ మిస్ వరల్డ్ అయిన ఎరిన్.. టీవీ ప్రెజెంటర్‌గా కొనసాగుతున్నారు. 

 

రిషబ్ పంత్.. గర్ల్ ఫ్రెండ్ ఇషా నేగీతో..

వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తన గర్ల్ ఫ్రెండ్ క్రిస్టినాతో.. 

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏడెన్ మాక్రమ్ తన గర్ల్ ఫ్రెండ్ నికోలె ఒకానర్‌తో ఏడేళ్ల ప్రేమాయాణం గురించి తరచూ ఫొటోలు షేర్ చేస్తుంటాడు. 

ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ గర్ల్ ఫ్రెండ్ డానీ గిస్బోర్న్‌తో ఫోజిచ్చిన ఫొటోలు నెట్టింట్లో పెట్టిన కాసేపటికే వైరల్‌గా మారిపోయాయి.