Hindu Cricketers
Hindu Cricketers : విదేశాల్లో పుట్టి పెరిగినా తమ పూర్వీకుల సంస్కృతిని, సంప్రదాయాలను పాటిస్తున్నారు కొందరు క్రికెటర్లు. దేశం కోసం ఓవైపు క్రికెట్ ఆడుతూనే తమ పూర్వికుల నుంచి వచ్చిన సంప్రదాయాలను గౌరవిస్తున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే..
కేశవ్ ఆత్మానంద్ మహారాజ్ : దక్షిణాఫ్రికాకు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్ కేశవ్ ఆత్మానంద్ మహారాజ్. కేశవ్ డర్బన్ బీచ్‌లో ఆత్మానంద్, కాంచనమాల దంపతులకు జన్మించారు. కేశవ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కి చెందిన వారు. 1874 లో వీరంతా డర్బన్‌కు చేరుకున్నారు.
Gautam Gambhir : భారత క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త సెలక్షన్ కమిటీ అదే..
డానిష్ ప్రభాశంకర్ భాయ్ కనేరియా : డానిష్ ప్రభాశంకర్ భాయ్ కనేరియా లాల్జీభాయ్ కనేరియా, బబితా ప్రభాశంకర్ భాయ్ కనేరియా దంపతులకు జన్మించారు. కనేరియా పూర్వీకులు సూరత్ నుంచి వచ్చి ఒక శతాబ్దం క్రితం కరాచీలో స్థిరపడ్డారు. అతని బంధువు అయిన మాజీ టెస్ట్ వికెట్ కీపర్ అనిల్ దల్పత్ తర్వాత కనేరియా పాకిస్తాన్ తరపున ఆడిన మొదటి హిందువు.
లిటన్ కుమార్ దాస్ : లిటన్ దాస్ బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలోని బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు. బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్నారు లిటన్ దాస్.
ముత్తయ్య మురళీధరన్ : మాజీ క్రికెటర్ అయిన ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక క్రికెట్ కోచ్‌గా ఉన్నారు. సక్సెస్ ఫుల్ బౌలర్‌గా ఆయనకి పేరుంది. శ్రీలంకలోని క్యాండీలో హిల్ కంట్రీ తమిళ హిందూ కుటుంబంలో సిన్నసామి ముత్తయ్య, లక్ష్మీ దంపతులకు ఆయన జన్మించారు. మురళీధరన్ తాత పెరియసామి సినసామి 1920 లో మధ్య శ్రీలంకలోని తేయాకు తోటల్లో పనిచేయడానికి దక్షిణ భారతదేశం నుంచి వచ్చారు.
సమిత్ రోహిత్ పటేల్ : ఇంగ్లాండ్ కి చెందిన సమిత్ రోహిత్ పటేల్.. రోహిత్, సెజల్ దంపతులకు జన్మించారు. సమిత్ పటేల్ తల్లిదండ్రులు గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జన్మించారు. ఆగస్టు 2008 లో ఇంగ్లాండ్ తరపున పటేల్ తన వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసారు.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు.. 52 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు..
శివనారాయణ్ చందర్ పాల్ : కామ్‌రాజ్, ఉమా చందర్ పాల్‌లకు గయానాలోని యూనిటీ విలేజ్‌లో శివనారాయణ చందర్ పాల్ జన్మించారు. వెస్టిండీస్ జట్టు మాజీ కెప్టెన్ అయిన శివనారాయణ చందర్ పాల్ పూర్వీకులు భారతదేశం నుండి వెస్టిండీస్‌కు వచ్చి ఇక్కడ కార్మికులుగా మారారు. శివనారాయణ్ చందర్ పాల్ ఎనిమిదేళ్ల వయసు నుంచి తన గ్రామంలోని క్రికెట్ జట్టుకి ఆడడం ప్రారంభించారట.
సౌమ్య సర్కార్ : బంగ్లాదేశ్ క్రికెటర్ అయిన సౌమ్య సర్కార్ సత్ఖిరాలోని బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు. అసలు పేరు సౌమ్య శాంటో. తర్వాత శాంటో అనే పేరును తొలగించారట. సర్కార్ తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియోటి దేబ్‌నాథ్ పూజను వివాహం చేసుకున్నారు.
IND vs AUS : విశాఖ క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. చెబితే అస్సలు ఆగరు!
అలోక్ కపాలి : బంగ్లాదేశ్ క్రికెటర్ అయిన అలోక్ కపాలి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ లో బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సిల్హెట్ లోని ఒక హిందూ దేవాలయంలో పనిచేసారట.