Cristiano Ronaldo Georgina Rodriguez confirm engagement after 8 years relationship
ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి జార్జినా రోడ్రిగ్స్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. గత ఎనిమిదేళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని జార్జినా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
కాగా.. ఆమె చేతికి ఉన్న ఉంగరం చాలా ఖరీదైనదిగా తెలుస్తోంది. వజ్రాలతో పొదగబడిన ఈ రింక్ విలువ మూడు మిలియన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.26.30 కోట్లు ఉంటుంది సమాచారం.
2016లో స్పెయిన్‌లో జార్జినా, రొనాల్డో మొదటి సారి కలుసుకున్నారు. ఆ సమయంలో జార్జినా ఒక గూచీ దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తుండేది. అప్పుడు వారి మధ్య మొదలైన పరిచయం స్నేహంగా మారి ఆ తరువాత ప్రేమగా మారింది. 2017 నుంచి వారిద్దరు సహజీవనం చేస్తున్నారు.
పెళ్లికాకముందే ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు.2022లో ఈ జంటకు కవలలు జన్మించారు. వారిలో మగపిల్లాడు చనిపోయాడు. కాగా.. క్రిస్టియానో పెద్దకుమారుడు జూనియర్ క్రిస్టియానో 2010లో జన్మించాడు. అతడి తల్లి ఎవరు అనేది ఇప్పటి వరకు రొనాల్డో చెప్పలేదు. అతడు కూడా వీరితో పాటే ఉంటున్నాడు.