Manish Pandey : ఐపీఎల్‌లో ఆడడు కానీ.. ఈ టోర్నీలో మాత్రం.. 6,6,6,6, 4,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన మనీశ్ పాండే..
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20లో మనీశ్ పాండే పెను విధ్వంసం సృష్టించాడు.

IPL Veteran Manish Pandey Flaunt T20 Prowess In Maharaja Trophy KSCA T20
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20లో మనీశ్ పాండే పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు సాయంతో 58 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో మైసూర్ వారియర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు మనీశ్‌పాండే.
2025 మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20లో భాగంగా సోమవారం బెంగళూరు బ్లాస్టర్స్, మైసూర్ వారియర్స్ ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మైసూర్ వారియర్స్ బ్యాటర్లలో మనీశ్ పాండే అజేయ హాఫ్ సెంచరీ చేయగా, సుమిత్ కుమార్ (44 నాటౌట్), హర్షిల్ ధర్మాణి (38) లు రాణించారు. బెంగళూరు బ్లాస్టర్స్ బౌలర్లలో శుభాంగ్ హేగ్డే మూడు వికెట్లు తీశాడు.
View this post on Instagram
అనంతరం మయాంక్ అగర్వాల్ (66; 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించినా మిగిలిన వారు ఘోరంగా విఫలం కావడంతో బెంగళూరు బ్లాస్టర్స్ 19.2 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. దీంతో మైసూర్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. మైసూర్ బౌలర్లలో ఎల్‌ఆర్ కుమార్, అజిత్ కార్తీక్ చెరో మూడు వికెట్లు తీశారు. కృష్ణప్ప గౌతమ్‌రెండు వికెట్లు పడగొట్టాడు. శిఖర్ శెట్టి, మురళీధర వెంకటేష్ చెరో వికెట్ పడగొట్టారు.
ఐపీఎల్ 2025 మెగావేలంలో మనీశ్ పాండేను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.75లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన 92 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 37 పరుగులు మాత్రమే.